PM Modi France Visit: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం..
PM Modi France Visit: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్ స్వయంగా పారిస్ విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఇక మోదీ తన పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి దూరంగా ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదం వినిపిస్తుంటే, తనకు ఇంటికి వచ్చినట్లే ఉందని పేర్కొన్నారు.
Glimpses from a memorable community programme in Paris. Gratitude to all those who joined us. We are very proud of the accomplishments of our diaspora. pic.twitter.com/LYgCAQCYJl
ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘నేను ఏ దేశానికి వెళ్లినా అక్కడ ‘మినీ ఇండియా’ వాతావరణం ఉంటుంది. నేను గతంలో కూడా ఎన్నో సార్లు ఫ్రాన్స్‌కి వచ్చాను కానీ ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది. రేపు ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం. ఫ్రాన్స్ ప్రజలకు ఈ సందర్భంగా శుభకాంక్షలు. దేశానికి దూరంగా కూడా ‘భారత్ మాతాకీ జై’ అని వినిపిస్తుంటే ఇంటికి చేరుకున్నట్లే ఉంది. అదే సమయంలో జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించడం గర్వకారణంగా ఉంది. నాగరికత, ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు’’ అని అన్నారు.