Telugu News India News PM Narendra Modi France Visit: Modi Departs from Delhi to Paris For 2 Days tour Know full schedule
PM Modi France Visit: పారీస్ బయలుదేరిన ప్రధాని మోదీ.. ఫ్రాన్స్ టూర్ పూర్తి షెడ్యూల్ వివరాలివే..
PM Modi France Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో ఆ దేశానికి పయనమయ్యారు. ఇండో-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాల విస్తరణకు ఈ పర్యటన కీలకం కానుంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి కొద్దిసేపటి క్రితమే పారీస్ బయలు దేరిన ప్రధాని....
PM Modi France Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో ఆ దేశానికి పయనమయ్యారు. ఇండో-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాల విస్తరణకు ఈ పర్యటన కీలకం కానుంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి కొద్దిసేపటి క్రితమే పారీస్ బయలు దేరిన ప్రధాని.. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఓర్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయన పారీస్ విమానాశ్రయంలో ఘనస్వాగతం అందుకోనున్నారు. అనంతరం 7:30 గంటల సమయంలో సెనేట్‌కు చేరుకుని.. సెనేట్ అధ్యక్షుడు గెరాడ్ లార్చర్‌ను కలుస్తారు.
అలాగే 8:45 గంటలకు ప్రధాని మోదీ.. ఫ్రాన్స్ ప్రధాని ఎలిసబెత్ బోర్న్‌తో భేటీ అవుతారు. ఇంకా 11 గంటలకు ఐకానిక్ లా సీన్ మ్యూజికేల్‌లోని ఇండియన్ కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఆ తర్వాత అర్థరాత్రి 12:30 (భారత కాలమానం) గంటల సమయంలో ఎలీసీ ప్యాలెస్‌కి చేరుకుని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అందించే ప్రైవేట్ డిన్నర్‌లో హాజరవుతారు.