AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato: కాపురంలో చిచ్చురేపిన టమాట.. భర్త కూరలో టమాటా వేశాడని అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య

పెరిగిన టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కేజీ టమాటా ధర రూ.200 చేరువలో ఉంది. దీంతో గృహిణులు ఆచితూచి టమటా వినియోగిస్తున్నారు. పలు చోట్ల టమాట చోరీలు, హత్యలు జరుగుతున్నాయి కూడా. తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చు..

Tomato: కాపురంలో చిచ్చురేపిన టమాట.. భర్త కూరలో టమాటా వేశాడని అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య
Tomato Curry
Srilakshmi C
|

Updated on: Jul 13, 2023 | 10:02 AM

Share

భోపాల్: పెరిగిన టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కేజీ టమాటా ధర రూ.200 చేరువలో ఉంది. దీంతో గృహిణులు ఆచితూచి టమటా వినియోగిస్తున్నారు. పలు చోట్ల టమాట చోరీలు, హత్యలు జరుగుతున్నాయి కూడా. తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌ షాదోల్ జిల్లాలో ధన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెమ్‌హోరి గ్రామానికి చెందిన సందీప్ బర్మన్ చిన్న దాబాను నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం కూరలు చేస్తున్న సమయంలో.. సందీప్‌ భార్యకు తెలియకుండా టమాటా వినియోగింగాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య కోపంతో చిన్న కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. భార్య తిరిగిరాకపోవడంతో చేసేదిలేక సందీప్‌ ధన్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సందీప్‌ వద్ద అతని భార్య ఫోన్‌ నంబర్‌ తీసుకుని ట్రేస్‌ చేయగా..ఉమరియాలోని తన సోదరి ఇంట్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి దంపతులిద్దరికీ సర్దిచెప్పి పంపించినట్లు ధన్‌పురి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సంజయ్ జైస్వాల్ తెలిపారు. పెరుగుతున్న టమాటా ధరలతో సామాన్యులే కాదు.. వారి బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు