ఇదో విచిత్ర కుటుంబం.. అందరి పుట్టిన రోజులు ఒకటే రోజు! గిన్నీస్ బుక్‌లో చోటు

ఇదొక వింత ఫ్యామిలీ.. కుటుంబంలోని మొత్తం 7 మంది ఒకే రోజున, ఒకటే తేదీన జన్మించి గిన్నిస్‌ వరల్డ్ రికార్డు సాధించారు. ఏడుగురు తోబుట్టువులు పుట్టిన రోజులన్నీ సరిగ్గా ఒకే తేదీన వచ్చేశాయ్‌ మరి. కల్పితంగానో, అసంకల్పితంగానో చోటుచేసుకున్న..

ఇదో విచిత్ర కుటుంబం.. అందరి పుట్టిన రోజులు ఒకటే రోజు! గిన్నీస్ బుక్‌లో చోటు
Pakistani Family
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 13, 2023 | 8:59 AM

లాహోర్‌: ఇదొక వింత ఫ్యామిలీ.. కుటుంబంలోని మొత్తం 7 మంది ఒకే రోజున, ఒకటే తేదీన జన్మించి గిన్నిస్‌ వరల్డ్ రికార్డు సాధించారు. ఏడుగురు తోబుట్టువులు పుట్టిన రోజులన్నీ సరిగ్గా ఒకే తేదీన వచ్చేశాయ్‌ మరి. కల్పితంగానో, అసంకల్పితంగానో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. పాకిస్తాన్‌లోని లార్కానాకు చెందిన మాంగి కుటుంబం గురించే మనం చర్చిస్తోంది. పాక్‌కు చెందిన వీరి కుటుంబంలో తండ్రి అమీర్ అలీ, తల్లి ఖుదేజా. ఈ దంపతులకు 19-30 సంవత్సరాల వయస్సు గల ఏడుగురు పిల్లలున్నారు. సింధూ, ససూయ్-సప్నా (ఆడ కవలలు), అమీర్-అంబర్ (మగ కవలలు), ఆ తర్వత మళ్లీ మగ కవలలు అమ్మర్-అహ్మర్‌లు.. ఇలా మొత్తం ఏడు మందికి జన్మనిచ్చారు.

విశేషమేమిటంటే వీరందరి పుట్టిన రోజులు ఒకే తేదీన వచ్చాయి. ఏడుగురు సంతానం ఆగస్టు 1వ తేదీన జన్మించారు. దీంతో ఒకే తేదీన పుట్టిన అత్యధిక కుటుంబ సభ్యుల పేరిట ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వీరి ఫ్యామిలీలో మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే పిల్లల తల్లీదండ్రులైన అమీర్ అలీ, ఖుదేజాల పెళ్లి రోజు కూడా సరిగ్గా ఆగస్టు 1వ తేదీ కావడం విశేషం. వీరి వివాహం 1991, ఆగస్టు 1న జరిగింది. 9 మంది సభ్యులు కలిగిన వీరి కుటుంబంలో 7 మంది తోబుట్టువులు ఒకే తేదీన పుట్టి గిన్నీస్‌ రికార్డు నెలకొల్పారు.

Pakistani Family

Pakistani Family

అమెరికాలోని కమ్మిన్స్ కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఫిబ్రవరి 20న పుట్టినందుకు వీరి పేరిట గతంలో ఈ రికార్డు ఉంది. ఈ రికార్డును ప్రస్తుతం అమీర్ అలీ, ఖుదేజా దంపతులు తిరగరాశారు. ఖుదేజా జన్మనిచ్చిన ఏడుగురు సంతానం ఎటువంటి వైద్య ప్రమేయం లేకుండా సహజంగా జన్మించినట్లు గిన్సీస్‌ వరల్ రికార్డు అధికారులు తెలిపారు. పైగా ఒక్కరికి కూడా సిజేరియన్ ద్వారా జన్మనివ్వలేదని, అన్నీ సహజ జననాలేనని, బిడ్డలందరికీ సామూహిక పుట్టిన రోజు జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు దీనిని దేవుడి బహుమతిగా భావిస్తున్నట్లు ఆ దంపతులు తెలిపారు. నిజంగా ఇది వింతల్లో వింతే..!

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.