Ice Cream: ఐస్ క్రీమ్ ఇలా కూడా చేయొచ్చా..! కారు చక్రానికి డబ్బా కట్టి ఐస్‌క్రీమ్ తయారీ..
దేశీ జుగాడ్‌లకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. దేశీ జుగాడ్‌లు తయారు చేయడంలో ఇండియన్స్‌ది అందెవేసిన చెయ్యి. తాజాగా ఓ వ్యక్తి దేశీ జుగాడ్‌తో ఎంతో ఈజీగా ఐస్‌క్రీమ్ తయారు చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఓ వ్యక్తి అతను తన కారు చక్రానికి మూత ఉన్న ఓ చిన్న బకెట్ లాంటిది కట్టి అందులో ఐస్ క్యూబ్స్ వేశాడు. ఆ తర్వాత మరో క్యానులో పాలు, గుడ్లు, చాక్లెట్, పంచదార ఐస్‌క్రీమ్ తయారీకి కావలసిన రకరకాల వస్తువులను వేసి, దానిని ఐస్‌క్యూబ్స్ వేసిన బకెట్‌లో పెట్టి గట్టిగా మూత బిగించాడు. ఆ తర్వాత కారుని స్టార్ట్ చేసి రోడ్డుపై కొంత దూరం ప్రయాణం చేశాడు. ఆ తర్వాత కారు ఆపి కారు చక్రానికి కట్టిన బకెట్ విప్పి అందులో వుంచిన క్యాను బయటకు తీసి ఓపెన్ చేశాడు. అంతే చక్కగా ఐస్‌క్రీమ్ రెడీ అయిపోయి, క్యాను పై భాగంలో ఒక పొరలాగా తయారైంది. దానిని అతను టేస్ట్ చేసి, వావ్.. అద్భుతం అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చాడు. ఈ వింత జుగాడ్ వీడియో ఓ యూజర్ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఐస్ క్రీమ్ తయారీకి కొత్త విధానం.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వాట్ ఏన్ ఐడియా సర్‌జీ.. మీ ఐస్ క్రీమ్ మేకింగ్ అదుర్స్ అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...