Viral Video: ప్రేమించాను అన్నాడు..! చివరికి కేబుల్ వైర్లతో కట్టేసి సజీవంగా పాతిపెట్టిడు..
ప్రేమ ముసుగులో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు నేటి యువత. ప్రేమించిన అమ్మాయి దక్కలేదనో, ప్రేమను నిరాకరించిందనో దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రేమించిన అమ్మాయి తనను దూరం పెడుతుందని అతి దారుణంగా చంపేసాడు ఆ యువకుడు.
ప్రాసిక్యూటర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన జాస్మిన్ కౌర్ నర్సింగ్ కోర్సు కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడ ఆమెకు తారిక్‌జోత్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో అది ప్రేమకు దారితీసింది. కొంతకాలం తర్వాత తారిక్‌జోత్ ప్రవర్తనలో మార్పును గమనించిన జాస్మిన్ అతడిని దూరంపెట్టింది. దీంతో అతడు జాస్మిన్‌పై ప్రతీకారంతో రగిలిపోయాడు. ఆమెను చంపేయాలనుకున్నాడు. పథకం ప్రకారం 2021 మార్చి 5న ఆమెను నార్త్ పాలింప్టన్ ప్రాంతం నుంచి ఎత్తుకుపోయాడు. ఆ సమయంలో ఆమెను కేబుళ్లతో కట్టేసి, కళ్లకు గంతలు కట్టి, కారు డిక్కీలో కుక్కి ఏకంగా 640 కి.మీ. దూరంలో ఉన్న ఫ్లిండర్స్ రేంజెస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో ఆమె గొంతు కోశాడు. ప్రాణం ఉండగానే గోతిలో పాతిపెట్టాడు. ఘటనపై పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలు సేకరించారు. జాస్మిన్‌ను హత్య చేసింది తారికేనని నిర్ధారణకు వచ్చారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టులో అతడు తన తప్పును అంగీకరించాడు. జాస్మిన్ పాతిపెట్టిన ప్రదేశం నుంచి మృతదేహాన్ని వెలికి తీయగా.. పోస్ట్‌మార్టం నివేదికలో అతడు చంపిన తీరు బయటకువచ్చింది. ఈ కేసులో అతడికి కోర్టు జీవితఖైదు విధించే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...