- Telugu News Photo Gallery Cinema photos Suchitra Krishnamoorthi says I don't need to forgive Preity Zinta
‘ఆ హీరోయిన్‌ను ఇప్పటికీ క్షమించను.. ఆమె వల్లనే నా భర్తతో విడాకులు’
ప్రముఖ గాయని, నటి సుచిత్ర కృష్ణమూర్తి భర్త బాలీవుడ్ చిత్రనిర్మాత శేఖర్ కపూర్‌తో తన వైవాహిక జీవితం సవ్యంగా సాగకపోవడానికి ఓ హీరోయినే కారణమని, ఆమెను ఎప్పటికీ క్షమించబోనని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు..
Updated on: Jul 12, 2023 | 1:00 PM

ప్రముఖ గాయని, నటి సుచిత్ర కృష్ణమూర్తి భర్త బాలీవుడ్ చిత్రనిర్మాత శేఖర్ కపూర్‌తో తన వైవాహిక జీవితం సవ్యంగా సాగకపోవడానికి ఓ హీరోయినే కారణమని, ఆమెను ఎప్పటికీ క్షమించబోనని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.

1999లో తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన దర్శకుడు శేఖర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లాడింది నటి సుచిత్రి. వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఐతే వీరు 2007లో విడాకులు తీసుకున్నారు. పెళ్లికి ముందు నటిగా మంచి క్రేజ్ అందుకున్న సుచిత్ర పెళ్లి అనంతరం సినిమాలకు దూరంగా ఉంటోంది.

శేఖర్ కపూర్ ప్రేమలో నిజాయితీ లేదని, అతను నటి ప్రీతి జింటతో ప్రేమాయణం నడిపినట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె ప్రీతి జింటపై మరోమారు నిప్పులు చెరిగింది. తన విడాకులకు కారణం ప్రీతినే అని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ తనను క్షమించేది లేదని, భార్యాభర్తల మధ్యలో ప్రీతి దూరడం వల్లే తమ వైవాహిక జీవితం తెరపడిందని గతంలో కూడా హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

అప్పట్లోనే ఈ ఆరోపణలను ప్రీతిజింటా తిప్పికొట్టింది. 'నేను ఇప్పుడు నంబర్ వన్ నటిని. నువ్వు ఏ పని చేయవు. సాధారణ గృహిణివి. సుచిత్ర నాతో అలా మాట్లాడకు. నీ మానసిక స్థితి సరిగ్గా లేనట్లుంది. సైకియాట్రిస్ట్‌ని కలిస్తే మంచిదని ప్రీతి అప్పట్లోనే గట్టిగా కౌంటరిచ్చింది.

ప్రీతి వ్యాఖ్యలపై సుచిత్ర తాజాగా స్పందిస్తూ.. 'ఆమె మాటలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. ఆమెను క్షమించాల్సిన అవసరం కూడా లేదు. ఇది స్వేచ్ఛా ప్రపంచం. నేను గృహిణి అయినందుకు చాలా గర్వపడుతున్నాను. నా జీవితంలో 20 ఏళ్ల పూర్తి సమయం తల్లిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఆమె నా దృష్టిలో ఉన్నా లేకున్నా ఒకటే.. అంటూ ఎమోషన్ అయ్యారు.





























