Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone: స్మార్ట్‌ ఫోన్‌కు బానిపై మతి స్థిమితం కోల్పోయిన బాలుడు.. వీడియో వైరల్!

అల్వార్‌లోని ఓ బాలుడు ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై మతి స్థిమితం కోల్పోయాడు. బాలుడిని ప్రత్యేక పాఠశాలలోని నిపుణుల ద్వారా చికిత్స నందిస్తున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ భవానీ శర్మ మాట్లాడుతూ.. బాలుడు పబ్జీ, ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌లు ఆడేవాడని..

Smart Phone: స్మార్ట్‌ ఫోన్‌కు బానిపై మతి స్థిమితం కోల్పోయిన బాలుడు.. వీడియో వైరల్!
Gaming Disorder
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 13, 2023 | 7:18 AM

రాజస్థాన్‌: స్మార్ట్ ఫోన్ చేతిలోకొచ్చాక పిల్లలు ఆటలాడటం మర్చిపోయారు. ఎల్లప్పుడూ ఫోన్ తోనే గడుపుతూ ఉంటారు. దీంతో పలువురు చిన్నారులు అతి చిన్న వయసులోనే పలురకాల మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. తాజాగా అల్వార్‌లోని ఓ బాలుడు ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై మతి స్థిమితం కోల్పోయిన ఘటన సంచలనంగా మారింది. బాలుడి తల్లిదండ్రులు ప్రత్యేక పాఠశాలలోని నిపుణుల ద్వారా చికిత్స నందిస్తున్నారు.

స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ భవానీ శర్మ మాట్లాడుతూ.. బాలుడు పబ్జీ, ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌లు ఆడేవాడని అతని తల్లీదండ్రలు తెలిపారు. ఆ గేమ్‌లలో ఓడిపోవడాన్ని తట్టుకోలేక పోయాడు. ఇటువంటి పిల్లలు ఒక్కోసారి ఆన్‌లైన్‌ గేమ్‌లలో ఓడిపోవడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుంటారు. లేదంటే మానసిక సమతుల్యతను కోల్పోతారు. దీనిని గేమింగ్‌ డిజార్డర్‌ అంటారు. ఈ బాలుడు కూడా అదేవిధంగా మతిస్థిమితం కోల్పోయాడు. మేము ఇటువంటి పిల్లల కోసం భౌతిక క్రీడా కార్యకలాపాల ఫార్మాట్‌ను సిద్ధం చేశాం. ఇలా భౌతికంగా ఆటలు ఆడించడం ద్వారా ఓటమి భయాన్ని అధిగమించి, ఆటల్లో గెలవడానికి సహాయం చేస్తామని శర్మ తెలిపారు.

ఇవి కూడా చదవండి

గేమింగ్ డిజార్డర్ అంటే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. గేమింగ్ డిజార్డర్ అనేది డిజిటల్-గేమింగ్ లేదా వీడియో-గేమింగ్ వల్ల సంభవించే ఓ మానసిక రుగ్మత. ఆన్‌లైన్ ఆటలకు బానిసైన వారు ఇతర అన్నింటి కంటే ఆన్‌లైన్‌ గేమ్‌లకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతర కార్యకలాపాలపై ఆసక్తిని కోల్పోతారు. ఒకవేళ తాము ఆడే ఆటలో ఓడిపోతే వారి ప్రవర్తనా విధానం, వ్యక్తిగత, కుటుంబం, సామాజిక, విద్యా, వృత్తి ఇతర ముఖ్యమైన కార్యకలాపాలన్నీ గణనీయంగా ప్రభావితమవుతాయి. పేలవమైన పనితీరు, ఆందోళన, చిరాకు వంటి లక్షణాలు వారిలో కనిపిస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.