AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: పాఠశాలలో మద్యం తాగిన గురుకుల విద్యార్ధులు.. టీచర్‌పై నింద మోపేందుకు విఫలయత్నం

పాఠశాలలో మద్యం తాగుతూ పలుగురు విద్యార్ధులు అడ్డంగా బుక్కయ్యారు. దొరికిపోయామని భావించిన విద్యార్ధులు ఉపాధ్యాయుడిపై నింద మోపేందుకు విఫలయత్నం చేసి ఇరకాటంలో పడ్డారు. ఈ షాకింగ్‌ ఘటన ములుగు మండలం మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల..

Warangal: పాఠశాలలో మద్యం తాగిన గురుకుల విద్యార్ధులు.. టీచర్‌పై నింద మోపేందుకు విఫలయత్నం
Alcohol
Srilakshmi C
|

Updated on: Jul 13, 2023 | 7:38 AM

Share

వరంగల్‌: పాఠశాలలో మద్యం తాగుతూ పలుగురు విద్యార్ధులు అడ్డంగా బుక్కయ్యారు. దొరికిపోయామని భావించిన విద్యార్ధులు ఉపాధ్యాయుడిపై నింద మోపేందుకు విఫలయత్నం చేసి ఇరకాటంలో పడ్డారు. ఈ షాకింగ్‌ ఘటన ములుగు మండలం మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూపింది. వివరాల్లోకెళ్తే..

మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి మద్యం కొనుగోలు చేసి పాఠశాలలో తాగారు. విద్యార్ధులు మద్యం తాగడాన్ని గమనించిన పీఈటీ టీచర్‌ వారిని మందలించాడు. మరోమారు ఇలా చేయమని వారితో లెటర్‌ కూడా రాయించుకున్నారు. ఐతే ఆ తర్వాత రోజు చెప్పా పెట్టకుండా విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. పీఈటీ టీచర్‌ మద్యం తాగి వచ్చి, తాము తాగినట్లు లెటర్‌ రాయించుకున్నాడని తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లల మాటలు నమ్మిన తల్లిదండ్రులు ఆ మరుసటి రోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ విద్యారాణి, తహసీల్దారు సత్యనారాయణ స్వామికి తల్లిదండ్రులు మంగళవారం ఫిర్యాదు చేయడంతో పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగు చూశాయి.

తొమ్మిదో తరగతికి చెందిన విద్యార్థులు ఏడుగురు, ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులు ఇద్దరు మద్యం తాగారని విచారణలో తేలింది. మద్యం దుకాణంలో శనివారం రాత్రి విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజీల ఆధారంగా బయటపడింది. ఐతే ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి పాఠశాలకు రాకపోవడంతో విద్యార్ధులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రిన్సిపల్‌ అంకయ్య తెలిపారు. 21 ఏళ్లలోపు విద్యార్ధులకు మద్యం విక్రయించినందుకు మల్లంపల్లి శ్రీరామ వైన్స్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్