Security for Tomatoes: టమోటాలకు సెక్యూరిటీ సేల్స్.. ఎక్కడికక్కడ పోలీసులు, సీసీ కెమెరాలు..!

Karnataka: టమోటాల ధర దేశవ్యాప్తంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు వాటికి భద్రత అందుబాటులోకి వచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ధర పెరగడంతో తప్పని పరిస్థితి అయ్యింది. కర్ణాటకలోని ఆసియాలోనీ రెండో అతిపెద్ద టమోటా మార్కెట్ కోలార్ మార్కెట్‌లో..

Security for Tomatoes: టమోటాలకు సెక్యూరిటీ సేల్స్.. ఎక్కడికక్కడ పోలీసులు, సీసీ కెమెరాలు..!
Karnataka Kolar Market
Follow us
Raju M P R

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 14, 2023 | 9:11 AM

Karnataka: టమోటాల ధర దేశవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు వాటికి భద్రత అందుబాటులోకి వచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ధర పెరగడంతో తప్పని పరిస్థితి అయ్యింది. కర్ణాటకలోని ఆసియాలోనీ రెండో అతిపెద్ద టమోటా మార్కెట్ కోలార్ మార్కెట్‌లో ఇది అనివార్యమైంది. టమోటాకి అన్యూహాంగా పెరిగిన గిరాకీ ఇప్పుడు సెక్యూరిటీ తప్పని పరిస్థితిగా మారింది. కర్ణాటకలో కోలార్ టమోటా మార్కెట్ లో పోలీస్ భద్రత మధ్య టమోటా విక్రయాలను ప్రభుత్వం కొనసాగిస్తుంది. కోలార్ మార్కెట్ లో 14 కిలోల టమోటా బాక్స్ ధర రూ. 2200 నుంచి 2500 మేర ఉండడంతో ఆసియాలోనే రెండో అతిపెద్ద టమోటా మార్కెట్ నుంచి బంగ్లాదేశ్ పాకిస్తాన్‌తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు టమోటా ఎగుమతి అవుతుంది. దీంతో టమోటాకు మరింత డిమాండ్ పెరిగింది.

రేటు ఊహకు అందకుండా ఉండటంతో టమోటా మార్కెట్ లో అడుగడుగున సీసీ కెమెరాలు, అదనపు భద్రత ఏర్పాటు చేసి అమ్మకాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోలార్ జిల్లాలో 20వేల హెక్టార్లలో ప్రధాన ఆదాయ పంటగా టమోటా సాగు చేసిన రైతాంగం. అన్యుహంగా పెరిగిన టమోటా ధరతో రూ. లక్షల్లో ఆదాయాన్ని గడుస్తోంది. టమోటాలను మార్కెట్ కు తీసుకొస్తున్న రైతు లక్షల్లో ఇంటికి తిరిగి వెళుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో టమోటా సాగు చేసిన రైతులు పంటలను కాపాడుకునేందుకు పొలాల్లోనే కాపలా కాసేందుకు నానా అగచాట్లు పడాల్సిన పరిస్తితి కూడా ఎదురవుతోంది.

కోలార్ గోల్డ్ మైన్స్ ప్రాంతంలో ఇప్పుడు ఎర్ర బంగారం గా మారిన టమోటా పంట సాగు ముల్బాగల్ మాలూరు, కేజిఎఫ్, బంగారు పేట నియోజక వర్గాల్లో విస్తారంగా టమోటా సాగు చేసిన కొందరు రైతులకు నిజంగానే బంగారు పండింది. ధర ఆశాజకంగా ఉండడంతో టమోటా పంటలను దొంగలు బెడద నుంచి కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు పొలాల్లోనే రైతులు అంటున్నారు. కంటికి రెప్పలా టమోటా పంట ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. టార్చ్ లైట్‌లు  వేసుకుంటూ రాత్రంతా పొలం చుట్టూ గుర్కా ల్లా కాపలా డ్యూటీలు చేస్తున్నారు. చెట్టు చెట్టును కాపాడుకునే పరిస్థితిలో రైతులున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.