వీళ్ల దుంప తెగ.. ఇదెక్కడి పంచాయితీ! అర్థరాత్రి షాపులో దూరి ‘టమాటాలు, పచ్చి మిర్చి, అల్లం’ చోరీ..

ఇప్పటి వరకూ బంగారం, డబ్బు వంటి విలువైన వస్తువులను దొంగలు చోరీ చేసేవారు. ధరలు పెరగడంతో గత కొంత కాలంగా దేశంలో పలు చోట్ల టమాటాలు సైతం చోరీకి గురవుతున్నాయి. తాజాగా కొందరు దుండగులు అర్ధరాత్రి 2 కూరగాయల..

వీళ్ల దుంప తెగ.. ఇదెక్కడి పంచాయితీ! అర్థరాత్రి షాపులో దూరి 'టమాటాలు, పచ్చి మిర్చి, అల్లం' చోరీ..
Tomato
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 14, 2023 | 9:16 AM

లక్నో, జులై 14: ఇప్పటి వరకూ బంగారం, డబ్బు వంటి విలువైన వస్తువులను దొంగలు చోరీ చేసేవారు. ధరలు పెరగడంతో గత కొంత కాలంగా దేశంలో పలు చోట్ల టమాటాలు సైతం చోరీకి గురవుతున్నాయి. తాజాగా కొందరు దుండగులు అర్ధరాత్రి 2 కూరగాయల షాపుల్లకి ప్రవేశించి టమాటాలు, పచ్చి మిర్చి, అల్లం ఎత్తుకెళ్లారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతంలోని రెండు దుకాణాల్లో జరిగిన ఈ చోరీ ఉదంతం గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతంలోని రెండు దుకాణాల్లో జూలై 10 (సోమవారం) చోరీ జరిగింది. షాపు యజమానులు రామ్‌జీ, నయీమ్‌ఖాన్‌ ఇద్దరూ దుకాణాలు మూసివేసి రాత్రి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం తమ దుకాణాలు తెరిచి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. షాపులోకి వెళ్లి తనిఖీ చేయగా టమోటాలు, అల్లం, మిరపకాయలు చోరీకి గురైనట్లు గ్రహించారు. దీంతో వీరిద్దరూ  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మొత్తం 26 కిలోల టమోటాలు, 25 కిలోల మిర్చి, 8 కిలోల అల్లం చోరీకి గురైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కమతా ప్రసాద్, మహ్మద్ ఇస్లాం అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వార్తను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాష్ట్ర పోలీసులపై విరుచుకుపడ్డారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పేరును ‘స్పెషల్ టొమాటో ఫోర్స్’గా మార్చాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.