AP Rain Alert: ఏపీ వెదర్‌ రిపోర్ట్‌.. నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోని ఆలస్యంగా ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సరైన వర్షపాతం నమోదు కావడం లేదు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇప్పటి వరకూ 35 శాతం వర్షపాతం నమోదుకాలేదని..

AP Rain Alert: ఏపీ వెదర్‌ రిపోర్ట్‌.. నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
Weather Report
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 14, 2023 | 11:42 AM

అమరావతి, జులై 14: ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోని ఆలస్యంగా ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సరైన వర్షపాతం నమోదు కావడం లేదు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇప్పటి వరకూ 35 శాతం వర్షపాతం నమోదుకాలేదని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీ, తెలంగాణలో 35 నుంచి 36 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ నెలలోనైనా వర్షపాతం ఆశించిన మేరకు కురుస్తుందో లేదో అనే అనుమానం వ్యక్తం చేసింది. నైరుతి రుతు పవనాల ప్రభావం దక్షిణాదిపై లేకపోయినా ఉత్తరాదిన మాత్రం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, డిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణాదిన మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గత 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ తూర్పు గోదావరి, చిత్తూరు, అన్నమయ్య, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.