AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్‌ ఘటన.. ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. ! వీడియో వైరల్

వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే చెంప పగలగొట్టిందో వరద బాదితురాలు. వర్షాల దాటికి హర్యానాలో వరదలు భీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి హర్యాణా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు..

షాకింగ్‌ ఘటన.. ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన మహిళ.. ! వీడియో వైరల్
Woman Slaps MLA
Srilakshmi C
|

Updated on: Jul 13, 2023 | 11:49 AM

Share

కైతాల్, జులై 13: వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే చెంప పగలగొట్టిందో వరద బాదితురాలు. వర్షాల దాటికి హర్యానాలో వరదలు భీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి హర్యాణా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇప్పటికే అనేక మంది వరద నీళ్లలో గల్లంతయ్యారు. పశువులు మృత్యువాత పడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ప్రకటించారు. తాజాగా ఆ రాష్ట్రంలోని కైతాల్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతం గుహ్లాను జననాయక్ జనతా పార్టీ (జేజేఏ) ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌ సందర్శించారు.

గుహ్లా చీకా నియోజకవర్గ ఎమ్మెల్యే రాకతో ఆ ప్రాంతంలో జనసమూహం గుమిగూడింది. ఆ ప్రాంతంలోని డ్రైనేజీ వ్యవస్థపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయిన ఓ బాధితురాలు ఎమ్మెల్యేపై దాడి చేసి చెంపపై కొట్టింది. వెంటనే ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది ఆయనను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

‘ఇప్పుడు ఎందుకు వచ్చారు? మేము చచ్చామో.. బతికామో.. చూడటానికి వచ్చావా’ అంటూ సదరు మహిళతోపాటు ఇతర స్థానికులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగడం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఈశ్వర్‌ సింగ్ స్పందిస్తూ.. మహిళపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, ఆమెను క్షమించినట్లు మీడియకు తెలిపారు. కాగా గత నాలుగు రోజులుగా హర్యానాతోపాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.