Masala Dosa: మసాలా దోసలో సాంబార్‌ ఇవ్వనందుకు రూ.3,500 జరిమానా.. రెస్టారెంట్‌కు కోర్టు మొట్టికాయ

కస్టమర్‌కు మసాలా దోసలో సాంబార్‌ ఇవ్వనందుకు రెస్టారెంట్‌కు కోర్టు భారీ జరిమానా విధించింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన మనీష్ పాఠక్ అనే లాయర్‌ రెస్టారెంట్‌కు వెళ్లి స్పెషల్ మసాలా దోశ పార్శిల్‌..

Masala Dosa: మసాలా దోసలో సాంబార్‌ ఇవ్వనందుకు రూ.3,500 జరిమానా.. రెస్టారెంట్‌కు కోర్టు మొట్టికాయ
Masala Dosa
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 14, 2023 | 7:08 AM

పట్నా, జులై 14: కస్టమర్‌కు మసాలా దోసలో సాంబార్‌ ఇవ్వనందుకు రెస్టారెంట్‌కు కోర్టు భారీ జరిమానా విధించింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన మనీష్ పాఠక్ అనే లాయర్‌ రెస్టారెంట్‌కు వెళ్లి స్పెషల్ మసాలా దోశ పార్శిల్‌ తీసుకున్నాడు. ఆ దోశకు ధర రూ.140 చెల్లించి పార్శిల్ తీసుకుని ఇంటికి వెళ్లాడు. పార్శిల్‌ విప్పి చూడగా దోశతోపాటు సాస్‌ మాత్రమే కనిపించాయి. సాంబార్‌ ప్యాకెట్‌ కనిపించలేదు. ఈ విషయమై మనీష్‌ ఆ మరుసటి రోజు సదరు రెస్టారెంట్‌కు వెళ్లి యజమానిని ప్రశ్నించాడు. రూ.140 మొత్తం రెస్టారెంట్‌ను కొంటావా? అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.

దీంతో చెర్రెత్తుకొచ్చిన లాయర్‌ సదరు రెస్టారెంట్‌కు లీగల్‌ నోటీస్‌ పంపాడు. ఐతే ఆ నోటీస్‌ పై రెస్టారెంట్‌ యాజమన్యం స్పందించలేదు. దీంతో లాయర్‌ మనీష్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. 11 నెలల విచారణ తర్వాత ఈ కేసును విచారించిన కమిషన్‌ రెస్టారెంట్‌దే తప్పు అని నిర్ధారించింది. దీనితో రెస్టారెంట్ యజమాని వినియోగదారునికి రూ.3,500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తం జరిమానా 45 రోజుల్లోపు చెల్లించాలని, సకాలంలో చెల్లించకపోతే 8 శాతం వడ్డీ విడిగా చెల్లించాల్సి ఉంటుందని కమిషన్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.