నదిలోకి కొట్టుకుపోయిన ప్రభుత్వ పాఠశాల.. 17 సెకన్లలో కుప్పకూలిన భవనం

గత కొద్దిరోజులుగా ఉత్తర భారతంలో వానలు దంచికొడుతున్న సంగతి తెలసిందే. ఉత్తర​ప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపుర్​ఖేరీలో శారదా నది ఉధృతంగా..

నదిలోకి కొట్టుకుపోయిన ప్రభుత్వ పాఠశాల.. 17 సెకన్లలో కుప్పకూలిన భవనం
Govt School Building
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 14, 2023 | 7:38 AM

లక్నో, జులై 14: గత కొద్దిరోజులుగా ఉత్తర భారతంలో వానలు దంచికొడుతున్న సంగతి తెలసిందే. ఉత్తర​ప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపుర్​ఖేరీలో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున ఉన్న పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్థులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో లఖింపూర్ ఖేరీ జిల్లా ఫూల్‌బెహార్ బ్లాక్‌లోని అహిరానా గ్రామంలోని ఓ ప్రాథమిక పాఠశాల గురువారం ఉదయం (జులై 14) శారదా నదిలోకి కొట్టుకుపోయింది. అందరూ చూస్తుండగా 27 సెకన్ల వ్యవధితలో పాఠశాల కొట్టుకుపోయింది. పాఠశాలతోపాటు అదే గ్రామంలోని మరో రెండు ఇళ్లు కూడా నదిలోకి కొట్టుకుపోయాయి.

నేపాల్‌లోని కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత వారం రోజుల నుంచి శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే దాదాపు డజను ఇళ్లు, గుడిసెలు, వేల ఎకరాల పంటలు వర్షార్పితమయ్యాయి. ఈమేరకు మంగళవారం ఖేరీ డీఎం మహేంద్ర బహదూర్ సింగ్ గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఖేరీ డీఎం మహేంద్ర బహదూర్ సింగ్ మంగళవారం ముంపుకు గురైన గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రెండు రోజుల క్రితం డీఎం మహేంద్ర ఆదేశించినా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్థులు ఆరోపించారు. శారదా నది ఉధృతి వల్ల గత ఐదేళ్లలో సుమారు 200 ఇళ్లు నదిలో కొట్టుకుపోయాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.