- Telugu News Photo Gallery Cinema photos Kannada Actress Thapaswini Poonacha gets married to Boy Friend Rakshath Muthanna
సీక్రెట్‌గా పెళ్లి పీటలెక్కిన హీరోయిన్.. ఇంతకీ వరుడు ఎవరంటే?
కన్నడ హీరోయిన్ తపస్విని పూనచ, ప్రియుడు రక్షత్ ముత్తన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది..
Updated on: Jul 14, 2023 | 8:42 AM

కన్నడ హీరోయిన్ తపస్విని పూనచ, ప్రియుడు రక్షత్ ముత్తన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట గత గురువారం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని నటి తపస్విని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది.

'నా కోసం నాకు నేనుగా మంచి బహుమతిని ఎంచుకోలేను. నాకేం కావాలో మీకు బాగా తెలుసు. మూడేళ్ల మా ప్రయాణం పెళ్లి అనే రెండక్షరాల పదంతో మరింత అర్థవంతంగా మారింది. మా పెళ్లి జరిగి నెల రోజులే అవుతుందంటే నమ్మలేకపోతున్నాను. మాతో కలిసి మా వివాహ వేడుకకు వచ్చి దీన్ని మరింత అందంగా మార్చిన బంధుమిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది.

కాగా తపస్విని, రక్షత్ కొడ్వల వివాహం కొడ్వల సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ మువీ హరికథే అల్ల గిరకథ అనే మువీతో తపస్విని హీరోయిన్‌గా అరంగెట్రం చేసింది. వివాహం అనంతరం త్వరలో షూటింగ్‌లో పాల్గొననుంది.




