AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు.. విఎంసీ పరిధిలో పలు చోట్ల ప్రత్యేక వసతులతో..

Andhra Pradesh: విజయవాడ నగరంలో మహిళల కోసం పింక్ టాయిలెట్లను నగర పాలక సంస్థ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పబ్లిక్ టాయిలెట్‌లకు అదనంగా పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేసింది. ఇవి కేవలం టాయిలెట్..

Andhra Pradesh: మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు.. విఎంసీ పరిధిలో పలు చోట్ల ప్రత్యేక వసతులతో..
Pink Toilets For Women
pullarao.mandapaka
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 13, 2023 | 11:16 AM

Share

Andhra Pradesh: విజయవాడ నగరంలో మహిళల కోసం పింక్ టాయిలెట్లను నగర పాలక సంస్థ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పబ్లిక్ టాయిలెట్‌లకు అదనంగా పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేసింది. ఇవి కేవలం టాయిలెట్ మాత్రమే కాదు.. ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని అధికారులు తెలిపారు. పింక్ టాయిలెట్‌లలో తల్లులు తమ బిడ్డలకు పాలు ఇచ్చేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక శానిటరీ నేప్కిన్స్ వెండింగ్ మెషీన్, మహిళా ప్రయాణికులు ఫ్రెష్ అయ్యేందుకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లనూ చేశారు.

అయితే మొదటి పింక్ టాయిలెట్‌ను బెంజి సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఇదే కాక నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా పింక్ టాయిలెట్లు నిర్మాణం చేపట్టేలా నగరపాలక సంస్థ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మహిళలు వ్యక్తిగత సమస్యలతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.