AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత పులి హల్‌చల్.. ‘బాలుడిపై దాడి’ ఘటన మరువక ముందే..

Tirupati: అలిపిరి బాటలో ఓ చిన్నారిపై చిరుత దాడిని మరువక ముందే మరోసారి వాటి సంచారం భక్తులకు భయాందోళనలు కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద బుధవారం సాయంత్రం అటుగా వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించింది. అయితే వెంటనే..

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత పులి హల్‌చల్.. ‘బాలుడిపై దాడి’ ఘటన మరువక ముందే..
Leopard In Tirumala
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 13, 2023 | 12:42 PM

Share

Tirumala News: అలిపిరి బాటలో ఓ చిన్నారిపై చిరుత దాడిని మరువక ముందే మరోసారి వాటి సంచారం భక్తులకు భయాందోళనలు కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద బుధవారం సాయంత్రం అటుగా వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించింది. అయితే వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు జీఎన్‌సీ వద్ద వాహనదారులను గుంపుగా పంపిస్తున్నారు. అలాగే ఆ చిరుతను దారి మళ్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవలే కర్నూల్ జిల్లాకు చెందిన దంపతులు తమ 4 ఏళ్ల కుమారుడు కౌశిక్‌తో కలిసి అలిపిరి నుంచి తిరుమలకు వెళుతున్న క్రమంలో.. బాలుడిపై చిరుత దాడి చేసింది. ఆ చిన్నారి తలను నోటకరుచుకని వెళ్తుండగా.. అప్రమత్తమైన తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే కేకలు వేయడంతో అది భయాందోళనకు గురై, చిన్నారిని విడిచివెళ్లింది. అయితే బాలుడు స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.

కాగా, చిరుత దాడిలో గాయపడ్డ చిన్నారి కౌశిక్‌ని జూలై 7న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న చిన్నారి కౌశిక్‌ని డిశ్చార్జి చేస్తున్న సమయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి కూడా అతనితోపాటు ఉన్నారు. ఇంకా చిన్నారి కుటుంబానికి శ్రీవారి దర్శన ఏర్పాట్లను టీటీడీ చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేవుడి దయతో ఆ చిన్నారి పూర్తిగా కోలుకున్నాడని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.