- Telugu News Photo Gallery Technology photos World's most advanced humanoid robot, Ameca draws a cat on canvas
Humanoid Robot Ameca: పిల్లి బొమ్మను గీసిన ‘అమెకా’.. చిత్రం చూస్తే బుర్ర బద్దలుకొట్టుకోవాల్సిందే..
Humanoid Robot Ameca: ప్రపంచం సాంకేతిక రంగంలో నిరంతరం పురోగతి సాధిస్తోంది. ఈ క్రమంలోనే రోబోటిక్స్‌లోకి కూడా ఒక పెద్ద అడుగు పడింది. ఇక అందులో భాగంగా రూపొందించిన అమెకా అనే అత్యాధునాతన రోబో ఇటీవలే పిల్లి బొమ్మను గీసింది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో దాన్ని రూపొందించిన రోబోటిక్ సంస్థకు చెందిన అధికారిక యూట్యూబ్ చానల్లో వైరల్ అవుతోంది.
Updated on: Jul 13, 2023 | 12:28 PM

ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉన్న రోబోటిక్స్ రంగం ఇప్పటికే అనేక రకాల హ్యుమానాయిడ్ రోటోలను రూపొందించింది. ఇవి ఎన్నో భాషలలో కమ్యూనికేట్ చేయగలగడంతో పాటు మానవుడి ఊహకు అందని పనులు కూడా చేయగలవు.

అలా ప్రపంచంలోని అత్యాధునాతన హ్యూమనాయిడ్ రోబోలలో ఒకటైన అమెకా ఇప్పుడు పిల్లిని గీసింది. హ్యూమనాయిడ్ రోబోల రూపకల్పన, తయారీకి పేరుగాంచిన యూకే ఆధారిత ఇంజినీర్డ్ ఆర్ట్స్ అనే రోటోటిక్ సంస్థ ఈ రోబోను అభివృద్ధి చేసింది. హ్యూమనాయిడ్ రోబోట్‌లో మొదటిది అని చెప్సే డ్రాయింగ్ చేయగల సామర్థ్యాన్ని అమెకాకు అందించింది సదరు కంపెనీ.

కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అమెకా పిల్లిని గీయమని అడిగారు. అమెకా ఎంతో నైపుణ్యంతో కాన్వాస్‌పై పిల్లి బొమ్మను డ్రా చేయడమే కాక సంతకం కూడా చేసింది.

అమెకాను ఇంజినీర్డ్ ఆర్ట్స్ కంపెనీ 2021లో అభివృద్ధి చేసింది. దీనిలో కెమెరా, మైక్రోఫోన్, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, స్టేబుల్ డిఫ్యూజన్, టెక్స్ట్ ప్రాంప్ట్‌ల ఆధారంగా చిత్రాలను రూపొందించడానికి డీప్-లెర్నింగ్ మోడల్ వంటి అనేక జోడింపులు ఉన్నాయి.

Ameca డ్రాయింగ్ కళా ప్రపంచంలోని దిగ్గజాలతో సమానంగా లేనప్పటికీ, ఈ విధమైన అభివృద్ధి AI, రోబోట్స్ మానవునిలాగా మారడానికి ఎలా దగ్గరవుతున్నాయో చూపిస్తుంది. ఇంజనీర్డ్ ఆర్ట్స్ తనను తాను ప్రముఖ డిజైనర్, హ్యూమనాయిడ్ ఎంటర్‌టైన్‌మెంట్ రోబోట్ రూపకర్తగా అవతరింపజేసుకుంటోంది.





























