Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భాగ్యనగరంలో బీజేపీ నాయకుడు కిడ్నాప్.. వారే కిడ్నాప్ చేశారని భార్య అనుమానం..!

Hyderabad: బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి ముక్కెర తిరుపతిరెడ్డి కిడ్నాప్‌కు గురయ్యాడు.. హైదరాబాద్ లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కిడ్నాప్ జరిగినట్లు భావిస్తున్నారు.. తిరుపతిరెడ్డి భార్య సుజాత పిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని..

Hyderabad: భాగ్యనగరంలో బీజేపీ నాయకుడు కిడ్నాప్.. వారే కిడ్నాప్ చేశారని భార్య అనుమానం..!
Mukkera Tirupathi Reddy
Follow us
G Peddeesh Kumar

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 14, 2023 | 9:29 AM

Hyderabad: బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి ముక్కెర తిరుపతిరెడ్డి కిడ్నాప్‌కు గురయ్యాడు.. హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కిడ్నాప్ జరిగినట్లు భావిస్తున్నారు.. తిరుపతిరెడ్డి భార్య సుజాత పిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దుబ్బకుంటపల్లి గ్రామానికి చెందిన ముక్కెర తిరుపతిరెడ్డి ప్రస్తుతం బీజేపీ లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నాడు.. జనగామ టిక్కెట్ రేసులో వున్నాడు. వృత్తి రీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తిరుపతిరెడ్డి హైదరాబాద్‌లోని కుషాయిగూడలో కుటుంబంతో స్థిరపడ్డాడు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అల్వాల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారని తిరుపతిరెడ్డి భార్య సుజాత పోలీసులకు పిర్యాదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే కొంతకాలంగా అల్వాల్ పాకాలకుంట పరిధిలో భూ వివాదం కొనసాగుతుంది.. 5,929 గజాల స్థలం విషయంలో వివాదం కొనసాగుతుంది.. భూ వివాదంలో ప్రత్యర్ధులే కిడ్నాప్ చేసి ఉంటారని భార్య సుజాత అనుమానం వ్యక్తం చేస్తుంది.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం భూ వివాదంలో కిడ్నాప్ గురై హత్యకాబడ్డ రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య.. ప్రస్తుతం కిడ్నాపైన తిరుపతిరెడ్డి.. ఈ ఇద్దరూ ఒకే మండలానికి చెందినవారు కావడంతో ఈ కిడ్నాప్ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..