AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..

Bonalu: హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ జంట నగరాల్లో మద్యం దుకాణాలను మూసి వేయనున్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..
Wine Shops
Sanjay Kasula
|

Updated on: Jul 14, 2023 | 8:39 AM

Share

భాగ్యనగరంలో ప్రత్యేక సంస్కృతికి ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ జంట నగరాల్లో మద్యం దుకాణాలను మూసి వేయనున్నారు. ఈ రెండు రోజులపాటు ఇది అమలు జరగాలని పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశించారు. జంటనగరాల్లో ఆషాడ మాసంలో జరిగి జాతర ఉత్సవాలు ప్రతీ ఏడాది ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఆ రెండు రోజుల పాటు క్లోజ్ ఉంచాలని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. వైన్ షాపులతో పాటు బార్లు, మద్యం సర్వ్ చేసే క్లబ్‌లు, పబ్‌లను కూడా మూసివేయాలని వెల్లడించారు. దీంతో మద్యం షాపులన్నీ రెండు రోజుల పాటు పూర్తిగా క్లోజ్ చేయనున్నారు.

బోనాల పండుగని దృష్టిలో పెట్టుకుని వైన్స్​షాపులను బంద్ చేయాలని సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే లిక్కర్ సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తులు భారీ ఎత్తున హాజరవుతుండటంతో పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు మహంకాళి పీఎస్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూంను.. పోలీస్ కమాండ్‌ కంట్రోల్‌ రూంకి అనుసంధానం చేసి సీసీ కెమెరాల నిఘా పెంచారు. దాదాపు 5లక్షల మంది బోనాలు సమర్పిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం