Andhra Pradesh: పైపు లైన్ కోసం గుంత తవ్వతుండగా కనిపించిన అద్భుతం.. ఊరు ఊరంతా తరలివచ్చిన వైనం..
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలని సిద్దేశ్వరనగర్‌లో పురాతన విగ్రహం బయటపడింది. తాగు నీటి పైపులైన్ కోసం తవ్వకాలు జరుపుతుండగా దేవుని ప్రతిమల రూపంలోనున్న విగ్రహం వెలుగులోకి వచ్చింది. విగ్రహాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహించారు స్థానికులు.

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలని సిద్దేశ్వరనగర్‌లో పురాతన విగ్రహం బయటపడింది. తాగు నీటి పైపులైన్ కోసం తవ్వకాలు జరుపుతుండగా దేవుని ప్రతిమల రూపంలోనున్న విగ్రహం వెలుగులోకి వచ్చింది. విగ్రహాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహించారు స్థానికులు.
తాగునీటి పైపులైన్ కోసం మున్సిపాలిటీ అధికారులు గుంత తవ్వగా పురాతన విగ్రహాలు లభ్యమైన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకుంది. ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది. పురాతన కాలం నాటి ఓ రాతిబండపై దేవుళ్ల రూపాలు చెక్కి ఉన్నాయి. ఈ ప్రతిమల గురించి తెలుసుకున్న స్థానికులు ఆ విగ్రహన్ని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చారు. అయితే.. వారం రోజులు క్రితం బయటపడ్డ ఈ విగ్రహం స్థానికులు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. సోషల్ మీడియా ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. చేతిలో విల్లు, కత్తి ధరించిన ఆంజనేయస్వామి విగ్రహంగా భావిస్తున్నారు స్థానికులు. శిల్పంలో ఆంజనేయస్వామి పక్కనే ఉన్న మరో మహిళ రూపం ఎవరిదనేదానిపై చర్చలు సాగుతున్నాయి. ఇప్పటివరకు అధికారులు ఎవరూ రానప్పటికీ.. పురాతన కాలం నాటి విగ్రహంగా స్థానికులు చెబుతున్నారు. పంచముఖ ఆంజనేయస్వామి అవతారంలో ఆంజనేయస్వామి విల్లు ఖడ్గం ధరించి ఉంటాడని.. అందులోని ఓ రూపమే ఇది అని కొంతమంది ఆధ్యాత్మిక వేత్తలు చెప్పుకొస్తున్నారు.
ఇక.. సమీపంలోని సుప్రసిద్ధ దేవస్థానం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం ఉంది. పది సంవత్సరాల క్రితం వరకు కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి గుంతకల్లు సిద్దేశ్వరనగర్ ప్రాంతానికి మధ్య ఇళ్లు లేకపోగా.. కేవలం పంట పొలాలు, కొండ గుట్టలు మాత్రమే ఉండేవి. ఈ క్రమంలోనే.. అప్పట్లో నిర్మించిన ఆ ఆలయానికి ఈ విగ్రహానికి ఏదైనా సంబంధం ఉందా?.. ఈ విగ్రహం ఏ కాలం నాటిది అన్నది పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారులు తేల్చాల్సి ఉంది. తవ్వకాలు జరిగిన ప్రాంతంలో ఈ విగ్రహం కాకుండా భూగర్భంలో ఇంకా ఏవైన విగ్రహాలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఏదేమైనా… అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఈ పురాతన విగ్రహాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు నేతలు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
