Life Skills to Teach Kids: తండ్రి తన పిల్లలకు తప్పక నేర్పించాల్సిన అంశాలు.. మిస్సవ్వకుండా తెలుసుకోండి..
‘మొక్కై వంగనది మానై వంగుతుందా’.. అని పెద్దలు అంటుంటారు. ఇది ప్రధానంగా చిన్న పిల్లలను ఉద్దేశించి కామెంట్స్ చేస్తుంటారు. అయితే, ఈ కామెంట్స్ వెనుక పిల్లల ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. పిల్లలను చిన్నప్పుడే సన్మార్గంలో నడిపించాలని, మంచి అలవాట్లు నేర్పించాలని, జీవితం ఎలా ఉంటుందో చూపించాలని ఆ నానుడి ఉద్దేశ్యం. అవును, ప్రస్తుత కాలం పిల్లలకు.. తల్లిదండ్రులు అన్నీతామై ఉండటం వల్ల కష్టనష్టాలు,
‘మొక్కై వంగనది మానై వంగుతుందా’.. అని పెద్దలు అంటుంటారు. ఇది ప్రధానంగా చిన్న పిల్లలను ఉద్దేశించి కామెంట్స్ చేస్తుంటారు. అయితే, ఈ కామెంట్స్ వెనుక పిల్లల ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. పిల్లలను చిన్నప్పుడే సన్మార్గంలో నడిపించాలని, మంచి అలవాట్లు నేర్పించాలని, జీవితం ఎలా ఉంటుందో చూపించాలని ఆ నానుడి ఉద్దేశ్యం. అవును, ప్రస్తుత కాలం పిల్లలకు.. తల్లిదండ్రులు అన్నీతామై ఉండటం వల్ల కష్టనష్టాలు, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకు సహా తమ పనులు కూడా తాము చేసుకోలేని పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రులు ఉన్నంతకాలం వారికి ఎలాంటి లోటు ఉండదు. మరి ఆ తల్లిదండ్రులు దూరమైతే? కనీసం సొంత పనులు కూడా రాని ఆ పిల్లలు ఎలా బ్రతుకుతారు? ఎలా జీవితాన్ని నెట్టుకొస్తారు? అందుకే.. ఓ తండ్రి తన పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి వారిని వారి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ అంశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వ్యాయామం: పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పించాలి. ఇందులో ప్రధానమైనది వ్యాయామం. ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది. లేదంటే అనారోగ్య సమస్యలతో ఆనందం ఆవిరైపోతుంది. అందుకే.. చిన్నప్పటి నుంచే పిల్లలకు వ్యాయామం అలవాటు చేయాలి. పెద్దయ్యాక అది వారి దినచర్యగా మారుతుంది. వారు ఎల్లప్పుడు ఫిట్‌గా ఉంటారు.
ఇంటి పనులు, సొంత పనులు చేసుకోవడం: చాలా మంది పిల్లలకు తమ సొంత పనులు చేసుకోవడం కూడా రాదు. స్నానానికి నీరు వేడిపెట్టుకోవడం, దుస్తులు మడతపెట్టడం కూడా రానివారు ఉంటారు. అయితే, తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి బండి నడుస్తుంది. అదే వారు లేకపోతే? అందుకే.. ఇంటి పనులు పిల్లలుకు నేర్పించాలి. వారు నివసించే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దుస్తులు ఉతుక్కోవడం, సరిగ్గా మడతపెట్టుకోవడం వంటి సొంత పనులను పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాలి. తద్వారా వారు తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నప్పటికీ.. వారి పనులు వారు శుభ్రంగా చేసుకుంటారు.
క్షమాగుణం: పగ, కోపం, ద్వేషం.. ఒకరి ఎదుగుదలను నాశనం చేస్తాయి. అందుకే.. కోపం, ద్వేషానికి కారణమయ్యే వారిని వదిలేయడం, క్షమించడం, వారిపై దయ చూపడం వంటివి చేయాలి. తద్వారా మనసు ప్రశాంతంగా మారి, జీవితంపై ఫోకస్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లక్షణాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. క్షమాగుణం ఇతరులను దగ్గరకు చేరుస్తుంది. సంతోషాన్ని ఇస్తుంది. గొప్పతనాన్ని పెంచుతుంది.
ఫైనాన్స్ నిర్వహణ: ఆర్థిక నిర్వహణ అనేది ప్రతి ఒక్కరి జీవితానికి చాలా కీలకం. ఆర్థిక నిర్వహణ తెలిస్తే జీవితంలో రాణించడం చాలా సులభం. అందుకే చిన్న వయస్సు నుంచే పిల్లలకు ఆర్థిక నిర్వహణ, ఖర్చులు వంటి అంశాలపై అవగాహన కల్పించాలి. మనీ మేనేజ్‌మెంట్ చిన్నప్పటి నుంచే తెలిస్తే, పెద్దయ్యాక వారు చాలా జాగ్రత్తగా డబ్బులను వినియోగిస్తారు. తమ ఎదుగుదలకు డబ్బును ఖర్చు చేస్తారు.
వైఫల్యాలను ఎదుర్కోవడం: చాలా మంది వైఫల్యాలతో కుంగిపోతారు. ఇక అంతా అయిపోయిందని, ఇక జీవితంలో ఏం చేయలేమనే భావనలోకి వెళ్లిపోతుంటారు. తద్వారా డిప్రెషన్‌కు గురవుతారు. అందుకే.. పిల్లలకు చిన్ననాటి నుంచే వైఫల్యాలను ఎదుర్కోవడంపై అవగాహన కల్పించాలి. వాటి గురించి వివరించాలి. వైఫల్యాలను ఎదుర్కొని ఎలా నిలబడాలో నేర్పించాలి. తద్వారా వారు భవిష్యత్‌లో వైఫల్యాలు ఎదురైనా వెనుదిరగకుండా పోరాడి సక్సెస్ సాధిస్తారు.
సాధనాలను ఎలా ఉపయోగించాలి: పిల్లలకు సాధనాలను ఎలా ఉపయోగించాలనేది తప్పనిసరిగా నేర్పించాలి. చేసే పనికి, అవసరమైన వస్తువులను వినియోగించడంపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఒక పనిని చేస్తున్నప్పుడు.. దానిని ఎలా పూర్తి చేయాలి, ఇందుకు ఎలాంటి సాధరాలను ఉపయోగించాలి.. వంటి అంశాలను పిల్లలకు వివరించాలి. పనిని పూర్తి చేసేందుకు ఓపిక ఎంత అవసరం, వేటిని ఎలా ఉపయోగించాలో తప్పక తెలియజేయాలి.
వినడం: పిల్లలకు వినడం నేర్పించాలి. వినడం అనేది వ్యక్తి జ్ఞానం పెరుగుదలకు చిహ్నం అని చెప్పొచ్చు. పిల్లలు సాధారణంగా ఏం చెప్పినా పట్టించుకోరు. ఇటు మాట్లాడితే.. అటు వింటారు. పరిస్థితి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే.. పిల్లలకు చిన్నప్పటి నుంచే వినే అలవాటును నేర్పించాలి. తద్వారా వారిలో విషయ అవగాహన పెరుగుతుంది. వింటేనే నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది. అందుకే.. ముందుగా వినడం అలవాటు చేయాలి.
భావాల వ్యక్తీకరణ: భావ వ్యక్తీకరణ అనే చాలా ముఖ్యం. పిల్లలకు వారి భావోద్వేగాలను ఎలా వ్యక్తపరచాలో నేర్పించాలి. ఇందుకు అనుగుణమైన వాతావరణాన్ని సృష్టించాలి. తద్వారా వారి ప్రవర్తన కూడా ఉన్నతంగా ఉంటుంది. పిల్లలు తమలోని భావాలను నిజాయితీగా చెప్పుకోగలిగే స్వేచ్ఛను వారికి ఇవ్వాలి. పెద్దయ్యాక వారు తమ భావోద్వేగాలను స్వేచ్ఛగా చెప్పుకునే ధైర్యం కలిగి ఉంటారు.
స్వీకరించే గుణం: ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది ఉంటుంది. కాలంతో పాటు పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఈ మార్పులను స్వీకరించి, అందుకు అనుగుణంగా పయనించే తత్వాన్ని వారిలో పెంపొందించాలి. ఇది వారిని ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.
చేసే పనిలో నిజాయితి: పిల్లలకు చిన్ననాటి నుంచే నీతి, నిజాయితీ అంశాలను అలవాటు చేయాలి. చేసే పనిలో నిజాయితీ, నీతి ఉండాలని బోధించాలి.
అంతర్లీన తత్వాన్ని గుర్తించాలి: చాలా మంది పిల్లలు పైన కనిపించే రూపాన్ని చూసి ఆకర్షితులవుతారు. అందమైన బొమ్మలు కానీవ్వండి, రంగు రంగుల దుస్తులు, అందమైన గ్యాడ్జెట్స్ ఇలా ఆకర్షణీయమైన వాటివైపు చూస్తారు. అయితే, వీటి పైపై ఆకర్షణలుమ మాత్రమే.. వాటి అంతీర్లీన పరిస్థితులను కూడా గ్రహించే తత్వాన్ని పిల్లల్లో పెంపొందంచాలి. అది వస్తువులు గానీ, వ్యక్తులు గానీ.. పైకి కనిపించే ఆకర్షణలు కాలక్రమేణా గాయపరిచే అవకాశం ఉంది. అందుకే బాహ్య అందాన్ని కాకుండా అంతర్లీన అంశాలను గ్రహించాలి. ఆ విధంగా పిల్లలకు బోధించాలి.
నియంత్రణ, నిర్వహణ: ఇతరుల నియంత్రణగా ఉండటం, స్వంత సమయం కేటాయించడం, కట్టుబాట్లు అంశంపై పిల్లలకు చిన్ననాటి నుంచే నేర్పించాలి. పనులు, అభిరుచులు, సామాజిక కట్టుబాట్లు సమతుల్యం చేసుకునే సామర్థ్యాన్న పిల్లల్లో చిన్ననాటి నుంచే అలవరచాలి.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..