Relationship Tips: మగమహారాజులకు వరం ఈ మూడు ఆహారాలు.. రెగ్యులర్‌గా తీసుకుంటే ఆ సమస్యే ఉండదు..
How To Increase Sperm Count: పురుషులు చిన్నప్పటి నుంచి చాలా బాధ్యతలు తీసుకుంటుంటారు. చదువులు.. ఉద్యోగాల ఒత్తిడి, బాధ్యతలు ఇలా ఎన్నో సమస్యలతో వారు తరచుగా తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేరు.
Updated on: Jul 13, 2023 | 9:26 PM

How To Increase Sperm Count: పురుషులు చిన్నప్పటి నుంచి చాలా బాధ్యతలు తీసుకుంటుంటారు. చదువులు.. ఉద్యోగాల ఒత్తిడి, బాధ్యతలు ఇలా ఎన్నో సమస్యలతో వారు తరచుగా తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోలేరు. పెళ్లయిన తర్వాత ప్రతి మగాడు తండ్రి కావాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు అతను బలహీనమైన సంతానోత్పత్తి కారణంగా ఏళ్ల తరబడి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

పురుషుల సంతానోత్పత్తి, స్పెర్మ్ కౌంట్ పెంచడానికి కొన్ని ఆహారాలను తీసుకుంటే.. ఆ సమస్యను అధిగమించవచ్చు. సంతానోత్పత్తి సమస్యను దూరంచేసుకుని.. తండ్రి అవ్వాలనే ఆకాంక్షను నేరవేర్చుకునేందుకు ప్రధానంగా కొన్ని ఆహారాలు తినాలి.. పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరిచే ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

చేప: స్పెర్మ్ కదలిక చేపల వినియోగంతో ముడిపడి ఉందని అనేక అధ్యయనాలలో వెల్లడైంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చేపలలో పుష్కలంగా కనిపిస్తాయి. ఇది పురుషుల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఆహారం.. చేపలు తినడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి మెరుగుపడుతుంది.

పండ్లు - కూరగాయలు: భారతదేశంలో ఆయిల్ ఫుడ్ తినే ధోరణి చాలా ఎక్కువగా ఉంది. ఇది మొత్తం ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే పురుషులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి తాజా పండ్లు.. కూరగాయలను తీసుకోవాలి. ఇది స్పెర్మ్ నాణ్యతను పెంచడంతోపాటు.. పురుషుల సంతానోత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది.

వాల్నట్: కొలెస్ట్రాల్ తగ్గించడానికి, స్థూలకాయాన్ని తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వాల్‌నట్‌లను ఉత్తమ డ్రై ఫ్రూట్స్‌లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే వాల్‌నట్‌ల సహాయంతో స్పెర్మ్ జీవశక్తిని పెంచవచ్చని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందుకే పురుషులు వాల్నట్ లను తప్పనిసరిగా డైలీ డైట్‌లో చేర్చుకోవాలి.




