- Telugu News Photo Gallery CM Stalin opposes Uniform Civil Code, writes to Law Commission expressing TamilNadu strong opposition
Uniform Civil Code: యూనిఫామ్ సివిల్ కోడ్‌కు తాము వ్యతిరేకమన్న సీఎం స్టాలిన్.. లా కమిషన్‌కు లేఖ
దేశంలో ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి లా కమిషన్ అభిప్రాయల సేకరణ చేస్తోంది. ఈసారి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Updated on: Jul 13, 2023 | 9:09 PM

దేశంలో ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి లా కమిషన్ అభిప్రాయల సేకరణ చేస్తోంది. ఈసారి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్‌కు ఇప్పటికే పలు విపక్ష పార్టీలు మద్ధతు తెలుపగా మరికొన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా యూసీసీపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఉమ్మడి పౌర స్మృతిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు లా కమిషన్ ఛైర్మన్‌కు లేఖ రాశారు. సమాజంలో విభిన్న వ్యవస్థలు ఇది సవాలు చేస్తుందని.. దీంతో ఇది ముప్పుగా మారుతోందని అందులో తెలిపారు.

భిన్న సంప్రదాయాలు కలిగిన సమాజంగా పేరున్న ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేయాలనే ఆలోచనను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ప్రజల సంప్రదాయాలు, పద్ధతులు కాపాడుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పిస్తోందన్నారు. గిరిజన వర్గాలపై ఇది ప్రభావం చూపుతుందని.. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను పరిగణలోకి తీసుకోకుండా ఈ బిల్లు అమలు చేస్తే దుష్ప్రభావాలు ఉంటాయని పేర్కొన్నారు.

అంతేకాక యూసీసీ వల్ల సమాజంలో పలు వర్గాల మధ్య అశాంతికి దారి తీస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్‌కు ఇప్పటిదాక 46 లక్షల అభిప్రాయాలు వచ్చాయి. అయితే ఈ అభిప్రాయాలు తెలియజేసేందుకు జులై 14న గడువు ముగుస్తుంది.




