- Telugu News Photo Gallery Cricket photos R Ashwin gets 4th Spot as Most wicket taker in India vs West Indies in Test matches
IND vs WI Tests: ఆశ్విన్ ఖాతాలో మరో రికార్డ్.. విండీస్‌పై ఆ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా..
IND vs WI 1st test: భారత్, వెస్టిండీస్ మధ్య తాజాగా జరిగిన తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ ముందు విండీస్ ప్లేయర్లు నిలవలేకపోయారు. ఫలితంగా భారత్ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 12 వికెట్లు తీసిన అశ్విన్ ఓ అరుదైన లిస్టులో స్థానం పొందాండు. భారత్-వెస్టిండీస్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన 4వ ఆటగాడిగా కపిల్-కుంబ్లే వంటి దిగ్గజాల సరసన చేరాడు. అసలు ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 15, 2023 | 8:06 AM

భారత్-వెస్టిండీస్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. విండీస్‌పై 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కపిల్ దేవ్ మొత్తం 89 వికెట్లు పడగొట్టాడు.

ఈ లిస్టులో విండీస్ మాజీ ప్లేయర్ మాల్కో మార్షల్ రెండో స్థానంలో ఉన్నాడు. భారత్‌పై 17 మ్యాచ్‌లు ఆడిన మాల్కో మొత్తంగా 76 వికెట్లు తీసుకున్నాడు.

అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఈ లిస్టు మూడో స్థానంలో ఉన్నాడు. కరేబియన్లపై 17 మ్యాచ్‌లు ఆడిన కుంబ్లే 74 వికెట్లు పడగొట్టాడు.

తాజాగా ముగిసిన భారత్-వెస్టిండీస్ తొలి టెస్టులో 12 వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ ఆశ్విన్ ఈ లిస్టు నాల్గో స్థానానికి చేరుకున్నాడు. మొత్తంగా విండీస్ టీమ్‌తో 12 మ్యాచ్‌లు ఆడిన ఆశ్విన్ 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇది ఆశ్విన్ కంటే ముందు ఉన్నవారి కంటే చాలా వేగవంతమైన ఫీట్ కావడం విశేషం. ఇంకా విండీస్‌పై కపిల్, కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో ప్లేయర్‌గా కూడా రికార్డుల్లో నిలిచాడు.

భారత్-వెస్టిండీస్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన 5వ ఆటగాడిగా టీమిండియా మాజీ ప్లేయర్ శ్రీనివాస్ వెంకటరాఘవన్ ఉన్నాడు. విండీస్‌తో 23 మ్యాచ్‌లు ఆడిన ఈ ప్లేయర్ మొత్తం 68 వికెట్లు తీసుకున్నాడు.





























