పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం.. ఓపెన్‌గా కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. కోట్ల రూపాయలు దుర్వినియోగం..
Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ దందా యాదేచ్చగా కొనసాగుతుంది.. డీలర్ నుంచి బియ్యం వచ్చిన తరువాత.. నిమిషాల్లో వ్యాపారుల చేతులో పడుతున్నాయి. కొందరి రేషన్ షాప్‌లో బియ్యం ఉండవు.. బియ్యం ఇవ్వరు... కాని లబ్దిదారులు వెళ్తే మాత్రం..
Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ దందా యాథేచ్చగా కొనసాగుతుంది.. డీలర్ నుంచి బియ్యం వచ్చిన తరువాత.. నిమిషాల్లో వ్యాపారుల చేతులో పడుతున్నాయి. కొందరి రేషన్ షాప్‌లో బియ్యం ఉండవు.. బియ్యం ఇవ్వరు… కాని లబ్దిదారులు వెళ్తే మాత్రం డబ్బులిస్తారు. అయితే ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కంటే మన రేషన్ డీలర్లు చాలా ముందంజలో ఉన్నారు. ఇలాంటి అక్రమాలను అడ్డుకునేందుకే రేషన్ షాప్‌ల్లో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తీసుకుని వచ్చింది. అంటే కుటుంబ సభ్యులలో ఆహార బద్రత కార్డులో పేరు ఉన్నవారిలో ఒకరు రేషన్ షాప్‌కు వెళ్లి బయో మెట్రిక్ మిషన్‌లో వేలి ముద్ర వేస్తే.. అప్పుడు ఆ కుటుంబానికి బియ్యం ఇస్తారు.
ప్రభుత్వం ఇలా ఎన్ని నిబంధనలు పెట్టిన అక్రమ వ్యాపారుల ముందు అవి ఏమి పనిచేయవు.. వారి పని వారు చేసుకుంటూ వెళ్తారు. గత ముడేళ్లుగా ప్రభుత్వం కరోనా కారణంగా రేషన్ షాప్‌లలో ఉచితంగానే బియ్యం పంపిణి చేస్తున్నారు. అంటే లబ్దిదారులు బయోమెట్రిక్ వేసి ఉచిత బియ్యం తీసుకెళ్ళాలి. కానీ అలా చేయడంలేదు.
రేషన్ షాపులకు వచ్చే లబ్దిదారులు నుంచి రూ. 10 లకు కొనుగోలు చేసి పెద్ద మొత్తం జమ అయ్యాక రైసు మిల్లులకు తరలిస్తున్నారు. రేషన్ షాపుల నుంచి, కొందరు అక్రమార్కులు లబ్ధిదారుల నుండి 10 రూపాయలకు బియ్యం కొనుగోలు చేసిన ఆ బియ్యాన్ని రైస్ మిల్లులలో అమ్ముతున్నారు. ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా లారీలలో మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మరికొందరు అయితే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి ఆమ్ముకుంటున్నరు. జిల్లాలో ఇప్పటికే అనేక సార్లు అక్రమ బియ్యం కొంటున్న కేటుగాల్లను పట్టుకొని జరిమానా వేసిన తిరిగి మళ్లీ అదే దందాను కొనసాగిస్తున్నారు.