Hyderabad: శామీర్ పేట్ గన్ ఫైర్ కేసులో కొనసాగుతోన్న విచారణ.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.
హైదరాబాద్ శివారు శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. స్మిత, మనోజ్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కాసేపట్లో మెజిస్ర్టేట్ ఎదుట హాజరుపర్చనున్నారు. నిందితుడు మనోజ్‌పై వేర్వేరు సెక్షన్లతో పాటు, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఫైరింగ్ చేసిన గన్‌ను...
హైదరాబాద్ శివారు శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. స్మిత, మనోజ్‌లకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కాసేపట్లో మెజిస్ర్టేట్ ఎదుట హాజరుపర్చనున్నారు. నిందితుడు మనోజ్‌పై వేర్వేరు సెక్షన్లతో పాటు, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఫైరింగ్ చేసిన గన్‌ను ఇప్పటికే ల్యాబ్‌కు పంపారు పోలీసులు. మనోజ్‌పై స్మిత కుమారుడు సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేయడంతో అధికారులు శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శనివారం శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల కలకలం రేపాయి. వైజాగ్ లోని హిందూజా థర్మల్ పవర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న సిద్దార్థ్ దాస్.. భార్య స్మిత గ్రంథితో 2019తో విడిపోయాడు.
అప్పటి నుంచి మనోజ్, ఇద్దరు పిల్లలతో కలిసి సెలబ్రిటి రిసార్ట్‌లో ఉంటుంది స్మిత. అయితే పిల్లల్ని చూసేందుకు సిద్దార్ధ్ దాస్ అక్కడకు వెళ్లిన క్రమంలో స్మితతో గొడవ జరిగింది. అదికాస్తా మనోజ్- సిద్ధార్థ్ మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో మనోజ్ ఎయిర్‌గన్‌తో సిద్ధార్థపై కాల్పులు జరిపాడు. నిందితుడు మనోజ్‌పై వేర్వేరు సెక్షన్లతో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు. నిన్న స్మితాను కలిసేందుకు సిద్ధార్థ్ దాస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే ఆయనతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు స్మితా. తనను కలవకుండా కోర్ట్ నుంచి తెచ్చుకున్న ఇంజక్షన్ ఆర్డర్ కాపీలను పోలీసులకు అందించారామె. దీంతో స్టేషన్ వదిలి వెళ్లాలని సిద్ధార్థకు సూచించారు పోలీసులు. ఆ తర్వాత సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. మనోజ్ బ్యాగ్రౌండ్‌పై ఆరాతీశారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..