Mithali Raj: బోనమెత్తిన మిథాలీరాజ్‌.. లాల్​దర్వాజా బోనాల జాతరలో ‘లేడీ టెండూల్కర్‌’ సందడి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ (జులై 16) లాల్‌ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వేడుకగా జరుగుతున్నాయి.

Mithali Raj: బోనమెత్తిన మిథాలీరాజ్‌.. లాల్​దర్వాజా బోనాల జాతరలో 'లేడీ టెండూల్కర్‌' సందడి
Mithali Raj
Follow us
Basha Shek

|

Updated on: Jul 16, 2023 | 4:03 PM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల సంబరాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ (జులై 16) లాల్‌ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే పలువురు ప్రముఖులు లాల్‌ దర్వాజ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈనేపథ్యంలో భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ లాల్​దర్వాజ బోనాల ఉత్సవాల్లో సందడి చేశారు. మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మిథాలీ లాల్‌ దర్వాజ బోనాల జాతరకు రావడం ఇదే మొదటిసారన్నారు. 115 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు మిథాలి.

బోనాల ఉత్సవాల చివరి రోజు సందర్భంగా లాల్​దర్వాజ ఆలయానికి ప్రముఖులు తరలివస్తున్నారు. బీఆర్ఎస్ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్​లు ఆలయానికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే బీజేపీ నేతలు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ తదితరులు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..