Pawan Kalyan: ఇన్‌స్టాలో పవన్‌ ఫస్ట్‌ పోస్ట్‌ ఇదే.. ఆ హీరోలందరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చాడుగా..

పవర్‌ స్టార్‌, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీతోనే రికార్డులు కొల్లగొట్టారు. ఈనెల నాలుగో తేదీన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసిన ఆయన కొన్ని గంటల్లోనే మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. అది కూడా ఎలాంటి పోస్ట్ చేయకుండానే.

Pawan Kalyan: ఇన్‌స్టాలో పవన్‌ ఫస్ట్‌ పోస్ట్‌ ఇదే.. ఆ హీరోలందరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చాడుగా..
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Jul 15, 2023 | 7:40 PM

పవర్‌ స్టార్‌, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీతోనే రికార్డులు కొల్లగొట్టారు. ఈనెల నాలుగో తేదీన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసిన ఆయన కొన్ని గంటల్లోనే మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. అది కూడా ఎలాంటి పోస్ట్ చేయకుండానే. ప్రస్తుతం పవర్‌స్టార్‌ను అనుసరించే వారి సంఖ్య 2.4 మిలియన్లను దాటిపోయింది. ఈక్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి పోస్ట్‌ షేర్‌ చేశారు పవన్‌. అయితే ఎవరూ ఊహించని విధంగా పోస్ట్‌ పెట్టారు పవన్‌. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, మహేష్‌ బాబు, ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రవితేజ, సమంత, కృష్ణ, అల్లురామలింగయ్య, దాసరి నారాయణరావు, ఏఆర్‌ రెహమాన్‌, రాజమౌళి, వేణుమాధవ్‌, ఖుష్బూ, విశ్వనాథ్‌, ఇలియానా, రామానాయుడు, మణిశర్మ, బోనీకపూర్‌, శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరావు, ఎమ్మెస్‌ నారాయణ, గద్దర్‌… ఇలా సినీ ఇండస్ట్రీలోని హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, కమెడియన్లు, నిర్మాతలు, సంగీత దర్శకులు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు, కన్నడ, తమిళ హీరోలతో కలిసున్న ఫొటోలను ఓ వీడియోగా రూపొందించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు పవన్.

ఈ వీడియోకు ‘చలనచిత్ర పరిశ్రమలో భాగమైన ఎంతోమంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలు మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్ట్‌ చేసిన గంటలోపే 4.36 లక్షల మంది ఈ వీడియోను లైక్‌ చేశారు .అలాగే వేలాది కామెంట్లు వస్తున్నాయి. కాగా ఈ పోస్ట్‌తో పవన్‌కు మరింత మంది ఫాలోవర్లు పెరిగే అవకాశం ఉంది. దెబ్బకు మరోసారి ఇన్‌స్టా షేక్‌ అవ్వడం ఖాయమని పవన్‌ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pawan Kalyan (@pawankalyan)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు