The Kerala Story: ‘సినిమా చూడకుండానే కొందరు…’ నెగటివ్ కామెంట్స్‌పై అదా శర్మ రియాక్షన్ ఇదే..
ది కేరళ స్టోరి సక్సెస్ అదా శర్మ ఇమేజ్‌ను మార్చేసింది. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా రాని గుర్తింపు ఒక్క సినిమాతోనే రావటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ది కేరళ స్టోరి సక్సెస్ అదా శర్మ ఇమేజ్‌ను మార్చేసింది. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా రాని గుర్తింపు ఒక్క సినిమాతోనే రావటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు అదా. అయితే ఈ సక్సెస్ తరువాత తన అనుభవాల గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. హార్ట్ ఎటాక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అదా శర్మకు ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసిన అనుకున్న రేంజ్‌లో గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో సిల్వర్ స్క్రీన్ కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా హడావిడి చేస్తూ వచ్చారు అదా. కానీ రీసెంట్ బ్లాక్ బస్టర్ ది కేరళ స్టోరి ఈ బ్యూటీ ఇమేజ్‌ను మార్చేసింది. ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ఏకంగా 200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చేయటంతో అదా గురించి నార్త్ సర్కిల్స్‌లో డిస్కషన్ జరుగుతోంది. అయితే సక్సెస్ తరువాత ఇండస్ట్రీ తనను ట్రీట్ చేసిన విధానం గురించి స్పదించారు అదా.
ది కేరళ స్టోరితో తన నటనకు మంచి అప్లాజ్ వచ్చిందన్న అదా, చాలా మంది మూవీ సెలబ్రిటీలు కూడా తనకు కాల్ చేసి విష్ చేశారని చెప్పారు. అయితే వాళ్లేవరు ఓపెన్ ప్లాట్ ఫామ్స్‌లో సినిమా గురించి మాట్లాడలేదని, అది వాళ్ల ఇష్టమన్నారు. సినిమా మీద వచ్చిన నెగెటివిటీ గురించి కూడా స్పందించారు అదా శర్మ. అసలు సినిమా కూడా చూడకుండానే కొంత మంది విమర్శలు చేశారని, కానీ సినిమా చూశాక వాళ్లు కూడా మనసు మార్చుకున్నారని చెప్పారు. ఎక్కువ మందికి నచ్చింది కాబట్టే ది కేరళ స్టోరి ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది అన్నారు అదా.