Hi Nanna: ‘హాయ్‌ నాన్న’ సినిమాలో నాని కూతురుగా న‌టించిన ఈ పాప ఎవరో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ పెద్ద‌దే..

ఇటీవల హాయ్‌ నాన్నకు సంబంధించి గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇది నాని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో హాయ్‌ నాన్న తెరకెక్కిందని ఇట్టే అర్థమవుతోంది. కాగా ఈ గ్లింప్స్‌లో నాని, మృణాళ్‌తో పాటు ఓ పాప స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది

Hi Nanna: 'హాయ్‌ నాన్న' సినిమాలో నాని కూతురుగా న‌టించిన ఈ పాప ఎవరో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ పెద్ద‌దే..
Hi Nanna Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 15, 2023 | 7:34 PM

దసరా వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత న్యాచురల్ స్టార్‌ నాని నటిస్తోన్న చిత్రం హాయ్‌ నాన్న. శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో మృణాళ్‌ ఠాకూర్‌, శ్రుతి హాసన్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా హాయ్‌ నాన్నను నిర్మిస్తున్నారు.కాగా నాని కెరీర్‌లో ఇది 30వ సినిమా. ఈక్రమంలో ఇటీవల హాయ్‌ నాన్నకు సంబంధించి గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇది నాని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో హాయ్‌ నాన్న తెరకెక్కిందని ఇట్టే అర్థమవుతోంది. కాగా ఈ గ్లింప్స్‌లో నాని, మృణాళ్‌తో పాటు ఓ పాప స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ చిన్నారి పేరు కియారా ఖన్నా. హాయ్‌ నాన్న మూవీలో తను నాని కూతురిగా నటించింది. అయితే ఈ చిన్నారికి ఇదే మొదటి సినిమా అనుకుంటే పొరపాటే. నాని సినిమా కంటే ముందే పలు బాలీవుడ్ సినిమాల్లో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది కియారా.

థాంక్ గాడ్, బందా సింగ్, బారాముల్లా, సాంబహదూర్ వంటి బాలీవుడ్ హిట్‌ చిత్రాల్లో నటించింది కియారా. అలియా భట్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా వంటి స్టార్‌ నటీనటులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. ఇక నెట్టింట కియారాకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా నిర్వహిస్తోంది. ఇందులో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటుంది. హాయ్‌ నాన్న సినిమాలో కూడా కియారా రోల్‌ బాగా హైలైట్‌ అవుతుందని కియారా తల్లి చెబుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు