TS Eamcet 2023 Phase 1 Results: మరికాసేపట్లో విడుదలకానున్న ఎంసెట్-2023 ఫేజ్ 1 కౌన్సెలింగ్ ఫలితాలు
తెలంగాణ ఎంసెట్-2023 ఫేజ్ 1 కౌన్సెలింగ్ ఫలితాలు ఆదివారం (జులై 16) విడుదల కానున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్న విద్యార్ధులు ఫేజ్ 1 ఫలితాలు విడులైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కొన్ని అనివార్య కారణాల రిత్యాజజ
హైదరాబాద్, జులై 16: తెలంగాణ ఎంసెట్-2023 ఫేజ్ 1 కౌన్సెలింగ్ ఫలితాలు ఆదివారం (జులై 16) విడుదల కానున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్న విద్యార్ధులు ఫేజ్ 1 ఫలితాలు విడులైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కొన్ని అనివార్య కారణాల రిత్యా అలాట్‌మెంట్ ఫలితాలను ప్రాసెస్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌లోని కొన్ని విభాగాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఐతే అలాట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికి తిరిగి వెబ్‌సైట్‌లోని అన్ని విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.
అలాట్‌మెంట్ ఫలితాల్లో కేటాయించిన కాలేజీ, కోర్సుకు సంబంధించిన సమాచారం ఉంటుంది. అలార్ట్‌మెంట్ ఆర్డర్ పొందిన తర్వాత ప్రవేశాలకు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ రోజుతో సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. జులై 22వ తేదీలోపు ఫీజు చెల్లింపులు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవల్సి ఉంటుంది. ఇక జులై 24 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు రెండో విడత, ఆగస్టు 4 నుంచి 11వ తేదీ వరకు చివరి విడత కౌన్సెలింగ్ జరుగుతుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.