- Telugu News Photo Gallery Cinema photos Actress Sai Pallavi Amarnath Yatra with parents says 'Life Itself Is A Pilgrimage'
‘అమర్‌నాథ్ యాత్ర తిరుగు ప్రయాణంలో ఆ దృశ్యం నన్ను ఆకట్టుకుంది’
దక్షిణాది హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన నటనతో, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో చిత్రపరిశ్రమలో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటి సాయిపల్లవి ఇటీవల ఆమె తన తల్లిదండ్రులతో కలిసి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సంగతి..
Updated on: Jul 16, 2023 | 11:40 AM

దక్షిణాది హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన నటనతో, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో చిత్రపరిశ్రమలో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటి సాయిపల్లవి ఇటీవల ఆమె తన తల్లిదండ్రులతో కలిసి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన సంగతి తెలసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను నటి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.

తన రెండు రోజుల ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఈ యాత్ర తన సంకల్ప శక్తిని సవాలు చేయడంతోపాటు మానసికంగా పలు పరీక్షలు పెట్టిందని సాయిపల్లవి పోస్టులో రాసుకొచ్చింది. సోషల్ మీడియాలో వ్యక్తిగత అంశాలు పంచుకోవడం ఇష్టపడను. కానీ ఎంతో కాలంగా అమర్‌నాథ్ యాత్ర చేయాలనుకున్న నా కల ఇన్నాళ్లకు నెరవేరింది.

దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఓ దృశ్యం నా మనసును ఆకట్టుకుంది. 60 ఏళ్ల వయసున్న నా తల్లిదండ్రులను యాత్రకు తీసుకువెళ్లడం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. చలిలో వాళ్లు ఊపిరి తీసుకోవడానికి ఆయాసపడుతూ ఛాతి పట్టుకోవడం, మార్గం మధ్యలో అలిసిపోవడం లాంటివి చూశాక ఎందుకింత దూరంలో ఉన్నావంటూ దైవాన్ని ప్రశ్నించాను.

నా ప్రశ్నకు తిరుగు ప్రయాణంలో సమాదానం దొరికింది. కొండ దిగి కిందకు వచ్చేటప్పుడు మనసుని హత్తుకునే దృశ్యాన్ని చూశా. అక్కడ కొంతమంది యాత్రికులు దీర్ఘ శ్వాస తీసుకుని ఓం నమః శివాయ అంటూ జపిస్తూ గుహలోని భోలేనాథ్‌ను దర్శించుకునేందుకు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ ప్రదేశం చాలా శక్తివంతమైనది. నిస్వార్ధ సేవకు నిదర్శనంగా నిలుస్తుంది. మన సంపద, అందం, శక్తితో సంబంధంలేకుండా ఆరోగ్యమైన శరీరం, బలమైన మనసు, ఇతరులకు సహాయపడేతత్వం భూమిపై మన ప్రయాణాన్ని మార్చబోతుంది. ఈ అమర్‌నాథ్ యాత్ర నా సంకల్ప శక్తికి సవాలు విసరడంతో పాటు నా ధైర్యాన్ని పరీక్షించింది. జీవితమే ఓ యాత్ర. నా యత్రను ఆనందాయకంగా మార్చిన వారందికీ ధన్యవాదాలంటూ తన పోస్టులో సాయిపల్లవి రాసుకొచ్చింది.





























