రిసార్ట్‌ రూంలో ప్రియురాలితో సీరియల్ నటుడు.. ఆమె భర్త రావడంతో గన్‌తో కాల్పులు

మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పుల కలకలం సృష్టించాయి. 'కార్తీకదీపం' సీరియల్‌ నటుడు మనోజ్‌ కుమార్‌ ప్రియురాలి భర్తపై కాల్పులు జరిపాడు. అసలేం జరిగిందంటే..

రిసార్ట్‌ రూంలో ప్రియురాలితో సీరియల్ నటుడు.. ఆమె భర్త రావడంతో గన్‌తో కాల్పులు
Shameerpet Celebrity Resort
Follow us
Srilakshmi C

| Edited By: Narender Vaitla

Updated on: Jul 16, 2023 | 2:31 PM

Shamirpet Gunfire incident: మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పుల కలకలం సృష్టించాయి. సీరియల్‌ నటుడు మనోజ్‌ కుమార్‌ ప్రియురాలి భర్తపై కాల్పులు జరిపాడు. అసలేం జరిగిందంటే..

విశాఖకు చెందిన సిద్ధార్ధ్‌ దాస్‌ (42) అతని భార్య స్మిత గ్రంథితో 2019లో విడాకులు తీసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు కూకట్‌పల్లిలోని ఫిడ్జ్‌ కాలేజీలో 12వ తరగతి, కుమార్తె శామీర్‌పెటలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. విడాకుల అనంతరం స్మిత సీరియల్‌ నటుడు మనోజ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రిసార్ట్‌లోని విల్లా నెంబర్ 21లో వీరిద్దరూ ఉన్నట్లు సమచారం అందుకున్న సిద్ధార్ధ్‌ రిసార్ట్‌కు వెళ్లాడు. అక్కడ జనోజ్‌ ఎయిర్‌ గన్‌తో సిద్ధార్ధ్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలైన సిద్ధార్ధ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సిద్ధార్ధ్‌ మాజీ భార్య స్మితాతో ఎఫైర్‌ కారణంగానే కాల్పులకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా పిల్లలను తనకు అప్పగించాలని గత కొంతకాలంగా సిద్ధార్ధ్‌ కోర్టులో పోరాడుతున్నాడు. పైగా గతంలో స్మిత పిల్లలపై మనోజ్‌ దాడి చేశాడని సిద్ధార్ధ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కూడా. స్మిత కొడుకు సైతం తనను చిత్రహింసలు పెట్టాడంటూ మనోజ్‌పై సంచనల ఆరోపణలు చేశాడు. అందులో భాగంగానే సిద్ధార్థ్‌ను చంపాలని ముందుగానే మనోజ్ కుమార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాధితుడు సిద్ధార్ధ్‌ దాస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.