Guntur: కడుపు నొప్పితో అల్లాడిన బాలుడు.. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు కడుపులో ఉన్నవి చూసి షాక్!
తొమ్మిదేళ్ల బాలుడు కడుపునొప్పితో విలవిలలాడాడు. అలాగే పసరు వాంతులు కూడా చేసుకోవడంతో తల్లిదండ్రులు హడావిడిగా ఆసుపత్రికి తరలించారు. బాలుడికి వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు రిపోర్టులు హడలెత్తిపోయారు..
గుంటూరు, జులై 16: తొమ్మిదేళ్ల బాలుడు కడుపునొప్పితో విలవిలలాడాడు. అలాగే పసరు వాంతులు కూడా చేసుకోవడంతో తల్లిదండ్రులు హడావిడిగా ఆసుపత్రికి తరలించారు. బాలుడికి వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు రిపోర్టులు హడలెత్తిపోయారు. నాలుగు అయస్కాంతాలు, ఈతకాయ విత్తనాలు, రబ్బర్ బుడగ, పాస్టిక్ స్ట్రా.. పలు రకాల వస్తువులు కడుపులో ఉండటంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఈ విచిత్ర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ (9) అనే బాలుడికి కడుపులో నొప్పి రావడంతో తల్లిదండ్రులు జులై 8న గుంటూరులోని యర్రాస్ హాస్పటల్‌కి తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు నిర్వహించగా బాలుడి కడుపులో ఒకదానికి ఒకటి అతుక్కున్న 4 అయస్కాంతాలు. వివిధ ప్లాస్టిక్ వస్తువులు, విత్తనాలు కనిపించాయి. అయస్కాంతాల ఆకర్షణతో చిన్న పేగులో మూడు చోట్ల, పెద్ద పేగులో ఒకచోట రంధ్రాలు పడినట్లు వైద్యులు గుర్తించారు.
దీంతో శనివారం బాలుడికి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న వస్తువులన్నింటినీ డాక్టర్లు తొలగించారు. రంధ్రాలు పడిన పేగులకు చికిత్స చేసినట్లు పిల్లల ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు యర్రా రాజేష్ తెలిపారు. పిల్లలు కనిపించిన వస్తువులన్నీ నోట్లో పెట్టుకుంటారని, వాటిని పొరపాగున మింగడం వల్లనే ఇలా జరిగిందని తెలిపారు. ఇటువంటి కేసును చాలా అరుదుగా వస్తుంటాయని ఆయన తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.