AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime: ఏపీ ప్రభుత్వ టీచర్ దారుణ హత్య.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం

విజయనగరం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. ఈ దారుణ ఘటన శనివరాం ఉదయం చోటు..

AP Crime: ఏపీ ప్రభుత్వ టీచర్ దారుణ హత్య.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
Aegireddy Krishna
Srilakshmi C
|

Updated on: Jul 16, 2023 | 10:55 AM

Share

విజయనగరం, జులై 16: విజయనగరం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారు. వాహనంతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. ఈ దారుణ ఘటన శనివరాం ఉదయం చోటుచేసుకుంది. రాజాం సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రాజాంలో నివాసముంటున్న ఏగిరెడ్డి కృష్ణ (58) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం తన ఇంటి నుంచి బైక్‌పై తెర్లాం మండలం కాలంరాజుపేటలోని పాఠశాలకు విధుల నిమిత్తం వెళ్తున్నారు. ఒమ్మి సమీపంలోని కొత్తపేట వద్ద బొలెరో వాహనం కృష్ణ ప్రయానిస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన కృష్ణ అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన తీరును బట్టి ఇది ముమ్మాటికీ

హత్యేనని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా ఇది హత్యేనని ధృవీకరించారు. నిందితులు హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు శ్రావణ్‌కుమార్‌ కేసు పెట్టగా.. ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సీఐ రవికుమార్‌ తెలిపారు.

అసలేం జరిగిందంటే..

తెలుగు దేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండే కృష్ణ తెర్లాం మండలం ఉద్దవోలుకు 1988 నుంచి 1995 వరకు సర్పంచిగా పని చేశారు. 1998లో టీచర్‌ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత నుంచి గ్రామంలో కృష్ణ ఎవరికి మద్దతు తెలిపితే వారే సర్పంచిగా గెలిచేవారు. 2021 ఎన్నికల్లో ఆయన మద్దుతో సర్పంచిగా నెగ్గిన సునీత ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వారిద్దరూ వైసీపీలో చేరారు. అప్పటికే ఆ పార్టీలో ఉన్న వెంకటనాయుడు దీన్ని జీర్ణించుకోలే పథకం ప్రకారం కృష్ణను హత్యచేసినట్లు ఆయన భార్య జోగేశ్వరమ్మ, కుమారుడు శ్రావణ్‌కుమార్‌, కుమార్తె ఝాన్సీతో పాటు బంధువులు ఆరోపిస్తున్నారు. తొలుత కృష్ణను వాహనంతో ఢీకొట్టారు. అనంతరం కొద్దిదూరం ఈడ్చుకెళ్లి రాడ్‌తో తలపై మోదడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.