Janasena: శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్‌లో యాక్షన్.. తిరుపతి పొలిటికల్ సర్కిల్స్‌లో రియాక్షన్..
Tirupati News: వారాహీ యాత్రలో ఉన్న పవర్ స్టార్ టెంపుల్ సిటీ టూర్ ఫిక్స్ చేసుకున్నారు. కాళహస్తికి నేనే వస్తా... అసలు కథ ఏంటో నేరుగా తెల్చుకుంటా నని చెప్పినట్లుగా నే రెడీ అయిపోయారు. స్పెషల్ ఫ్లైట్ లో తిరుపతి కి టూర్ ఫిక్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్ సిఐ అంజు యాదవ్ చేతిలో..
తిరుపతి, జూలై 16: జనసేన కార్యకర్త చెంప చెల్లుమనిపించిన ఘటన ఇప్పుడు పొలిటికల్ గా రీసౌండ్ ఇస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్ పెక్టర్ అంజూ యాదవ్ వన్ పోలీస్ స్టేషన్ లో చేసిన యాక్షన్ పొలిటికల్ సర్కిల్స్ లో రియాక్షన్ ఇస్తోంది. వారాహీ యాత్రలో ఉన్న పవర్ స్టార్ టెంపుల్ సిటీ టూర్ ఫిక్స్ చేసుకున్నారు. కాళహస్తికి నేనే వస్తా… అసలు కథ ఏంటో నేరుగా తెల్చుకుంటా నని చెప్పినట్లుగా నే రెడీ అయిపోయారు. స్పెషల్ ఫ్లైట్ లో తిరుపతి కి టూర్ ఫిక్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్ సిఐ అంజు యాదవ్ చేతిలో దెబ్బలు తిన్న కొట్టే సాయిని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. సిఐ అంజు యాదవ్ ఎందుకు కొట్టిందో చెప్పాలని ఎస్పీని కోరేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు జనసేనాని సోమవారం ఉదయం 10 గంటలకు తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ మేరకు తిరుపతి జనసేన పార్టీ నేతలు ప్రోగ్రాం కూడా ఫిక్స్ చేసారు.
జనసేన కార్యకర్త కొట్టే సాయిని కొట్టిన సీఐ అంజూ యాదవ్ పై ఎస్పీని నేరుగా జనసేనాని కలిసి ఫిర్యాదు చేయనున్నారని జనసేన నేతలు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ ప్రకటించారు. ఈ మేరకు ఎస్పీకి అపాయింట్మెంట్ అడిగామన్నారు. తిరుపతి ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఎస్పీ ఆఫీస్ కి పవన్ కళ్యాణ్ చేరుకుంటారని చెప్పారు. కొందరు పోలీసులు వైసీపీ డ్రెస్ వేసుకుని విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అలాంటి పోలీసులు ఇకనైనా వైసీపీ వైపు ఉంటారో ఐపీసీ వైపు ఉంటారో తేల్చు కోవాలన్నారు.
మరోవైపు హెచ్ఆర్సీ నోటీసులు
ఇక ఈ కేసులో పవన్ దూకుడు ఒకవైపైతే మరోవైపు హెచ్ ఆర్ సి సుమోటో గా కేసు నమోదు చేసింది. మానవ హక్కుల కమిషన్ ఈ మేరకు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ అంజు యాదవ్ తోపాటు పలువురికి నోటీసు జారీ చేసిన హెచ్ ఆర్ సీ 27 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం