Tomato Price: అంతా ‘టమాట’ చలవే..! కేవలం నెల రోజుల్లోనే కోటీశ్వరుడైన టమాట రైతు
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. టమాటాను కొనలేక సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఐతే టమాటా రైతులు మాత్రం కనీవినని రీతిలో లాభాలు గడిస్తున్నారు. దీంతో ఓ టమాటా రైతు కేవలం నెల రోజుల్లోనే కోటీశ్వరుడయ్యాడు. 20 ఏళ్లుగా..
ముంబై, జులై 16 : దేశ వ్యాప్తంగా టమాటా ధరలు హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. టమాటాను కొనలేక సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఐతే టమాటా రైతులు మాత్రం కనీవినని రీతిలో లాభాలు గడిస్తున్నారు. దీంతో ఓ టమాటా రైతు కేవలం నెల రోజుల్లోనే కోటీశ్వరుడయ్యాడు. 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న సదరు రైతు ఒక్క నెలలోనే ఎన్నడూ కనీవినని రీతిలో కోట్ల ఆదాయం రావడంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు. ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటకలోని టమాటా రైతులు రెండు నెలల వ్యవధిలోనే ఊహించని విధంగా ఆదాయం గడించారు.
మహారాష్ట్ర పుణె జిల్లాలోని తుకారాం భాగోజీ గయాకర్ అనే రైతు 13 వేల క్రేట్స్ టమాటాలను నెల రోజుల్లో అమ్మి రూ. 1.5 కోట్ల ఆదాయం పొందాడు. తుకారాం కుటుంబం తన గ్రామంలో 18 ఎకరాల సేద్యం భూమితో గత 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. మొత్తం భూమిలో ఈ ఏడాది 12 ఎకరాల్లో గత ఐదేళ్లుగా కేవలం టమాటా పంటను మాత్రమే పండిస్తున్నాడు. పసి బిడ్డలా టమాటా పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నా ఎప్పుడూ నష్టాలే వచ్చేవి. సాధారణంగా ఒక రోజు టమాటాలను అమ్మితే రూ.2,100 ఆదాయం వచ్చేది.
ఐతే శుక్రవారం 900 క్రేట్స్ టమాటాలను అమ్మగా ఒక్క రోజే ఏకంగా రూ.18 లక్షలు గడించాడు. ఇవే టమాటాలను గతంలో ఒక ట్రేట్ వెయ్యి నుంచి 2,400 వరకు మాత్రమే అమ్ముడు పోయేవి. ఐతే ఊహించని రీతిలో గత నెల రోజుల్లో టమాటా ధరలు ఆకాశానికి ఎగబాకడంతో తుకారం మాత్రమే కాకుండా పూణెలోని టమాటా రైతులందరూ మంచి ఆదాయాన్ని పొందారు. దాదాపు రూ.80 కోట్ల టమాటా వ్యాపారం జరిగిందని, వందకు పైగా మహిళలకు జీవనోపాధి దొరికినట్లు రైతులు కమిటీ వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.