Gold Price Today: స్థిరంగా బంగారం.. పెరిగిన వెండి .. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today: బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. తాజాగా ఆదివారం నాడు దేశ వ్యాప్తంగా గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. తాజాగా ఆదివారం నాడు దేశ వ్యాప్తంగా గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,500లు ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,550లుగా నిలిచింది. ఇక దేశ ఆర్థిక నగరం ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.55,000లు ఉండగా, అదే 24 క్యారెట్ల ధర రూ.60,000లు ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000లు ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000లు ఉండగా, విజయవాడ, వైజాగ్‌లోనూ హైదరాబాద్ ధరలే కొనసాగుతున్నాయి. ఇక గోల్డ్ రేట్ ధర స్థిరంగా ఉంటే.. సిల్వర్ రేట్ మాత్రం కాస్త పెరిగింది. కిలో వెండి రూ.400లు పెరిగి ప్రస్తుతం రూ.77,500 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి