జేబులో డబ్బులు ఉన్నా ఇవ్వడానికి ఇష్టంలేక లేవనీ, ట్రాఫిక్‌లో చిక్కుకున్నానని, సారీ.. బైక్‌లో పెట్రోల్ అయిపోయిందని నిత్యం నోటికొచ్చినట్లు అబద్దాలు ఆడేస్తుంటారట మగవారు. ఇలా ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువగా అబద్దాలు చెబుతారని తేలిపోయింది కాబట్టి ఇకపై ఎవరైనా ఇలాంటి సాకులు చెబితే అస్సలు నమ్మకండే. 58 శాతం మంది ఇబ్బందుల నుంచి తమను కాపాడుకునేందుకు, 42 శాతం సీక్రెట్లను దాచడానికి, 40 శాతం మంది నలుగురిలో చులకన అవ్వకుండా ఉండేందుకు అబద్దాలు చెబుతారని అధ్యయనాల్లో వెల్లడైంది.