- Telugu News Photo Gallery Cricket photos Team India Star Player KL Rahul test career almost finished after yashasvi jaiswal debut century against west indies
WI vs IND: టీమిండియా స్టార్ ప్లేయర్‌కే ముచ్చెమటలు పట్టించిన 171 ఫిగర్.. ఎందుకో తెలుసా?
KL Rahul Career: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో టీమ్ ఇండియా అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో భారత్ ఏకపక్షంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది.
Updated on: Jul 16, 2023 | 12:51 PM

KL Rahul Career: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో టీమ్ ఇండియా అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో భారత్ ఏకపక్షంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. టీమిండియా తరపున అద్భుత ప్రదర్శన చేసిన యశస్వీ జైస్వాల్, ఆర్. అశ్విన్‌లు ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు.

తొలి టెస్టు మ్యాచ్ ఆడిన యశస్వి జైస్వాల్ తన తొలి టెస్టు మ్యాచ్ లోనే 171 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఓపెనర్‌గా సెంచరీతో టీమ్‌ఇండియాలో శాశ్వత స్థానాన్ని కైవసం చేసుకుని, కేఎల్ రాహుల్ టెస్టు కెరీర్‌కు మంగళం పాడేశాడు.

నిజానికి కేఎల్ రాహుల్ టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడుతున్నాడు. రాహుల్ ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ కారణంగా రోహిత్‌తో పాటు ఇతర ఆటగాళ్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. అయితే, జైస్వాల్ కంటే ముందు శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బాగానే ఆకట్టుకున్నాడు.

ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే శతకం బాదిన జైస్వాల్.. ఓపెనర్ స్థానానికి తానే సరిపోతానని సూచించడంతో గిల్ మూడో స్థానంలో పర్మనెంట్ అయ్యే అవకాశాలు పెరిగాయి. అలాగే ఓపెనర్‌గా రాణిస్తున్న రాహుల్ టెస్టు కెరీర్ కూడా ప్రమాదంలో పడింది.

గత ఐపీఎల్‌లో లక్నో జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రాహుల్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడి లీగ్‌కు దూరమయ్యాడు. అయితే అంతకు ముందు అంతర్జాతీయ వేదికపై పేలవమైన ఫామ్ కారణంగా రాహుల్ కష్టాల్లో పడ్డాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో రాహుల్‌కు ఛాన్స్ లభించింది. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ రాహుల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.

దీంతో రెండు మ్యాచ్‌ల తర్వాత రాహుల్‌ను జట్టు నుంచి తప్పించారు. తర్వాత రెండు మ్యాచ్‌ల్లో గిల్ స్థానంలో రాహుల్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. నాగ్‌పూర్, ఢిల్లీలో జరిగిన 2 టెస్టు మ్యాచ్‌ల్లో రాహుల్ 38 పరుగులకే ఔటయ్యాడు.

రాహుల్ నిలకడ లేకపోవడంతో సెలక్టర్లు అతనిపై నమ్మకం కోల్పోతున్నారు. ఒకవేళ ఎంట్రీ ఇచ్చినా.. నిలకడను ప్రదర్శించకపోతే.. రాహుల్ టెస్ట్ కెరీర్ ముగియడం ఖాయం.

అయితే, వరుసగా రెండు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఓడిపోయిన టీమిండియా, ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌ను అనేక కీలక మార్పులతో ప్రారంభించింది. అందుకు తాజా ఉదాహరణగా టెస్టు స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారాను జట్టు నుంచి తప్పించడాన్ని మనం గమనించవచ్చు.

ఈ నేపథ్యంలో సెలక్టర్లు మళ్లీ రాహుల్‌కే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. విజయవంతమైన ఓపెనింగ్‌లో విఫలమైనప్పటికీ, జట్టు సక్రమంగా నడవాలంటే ఈ స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే కోచ్ రాహుల్ ద్రవిడ్ యువ ఆటగాళ్లను ఆదరిస్తాడు. జైస్వాల్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయినందున, మేనేజ్‌మెంట్ యశస్వికే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.





























