- Telugu News Photo Gallery Cricket photos From r ashwin to Muttiah Muralitharan These are the bowlers who have taken 12+ plus wickets most times in Test cricket
Test Cricket: టెస్టు క్రికెట్‌లో ఎక్కువసార్లు 12+ వికెట్లు తీసిన బౌలర్లు వీరే.. అగ్రస్థానంలో మనోడే..
R Ashwin Records: అతి తక్కువ మ్యాచ్ ల్లోనే అశ్విన్ ఈ ఘనత సాధించడం విశేషం. టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా 12+ వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 18, 2023 | 12:28 PM

India vs West Indies 1st Test: డొమినికాలోని విండ్సర్ పార్క్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రవిచంద్రన్ అశ్విన్ హీరోగా నిలిచాడు.

విండీస్‌తో జరిగి తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆర్ అశ్విన్.. తన స్పిన్‌తో 2వ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. దీని ద్వారా టెస్టు క్రికెట్‌లో 6వ సారి 12 లేదా 12+ వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అంటే టెస్టు క్రికెట్‌లో 12 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ రికార్డును అశ్విన్ సమం చేశాడు. అయితే, అశ్విన్ అతి తక్కువ మ్యాచ్ ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇంతకీ టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా 12+ వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో ఓసారి చూద్దాం..

1- రవిచంద్రన్ అశ్విన్: టీమిండియా స్పిన్ ఛామర్ రవిచంద్రన్ అశ్విన్ కేవలం 93 టెస్టు మ్యాచ్‌ల్లో 486 వికెట్లు తీశాడు. అతను 6 సార్లు 12 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం విశేషం.

2- ముత్తయ్య మురళీధరన్: శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 133 మ్యాచ్‌ల్లో మొత్తం 800 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతను 6 సార్లు మాత్రమే 12 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.

3- రంగనా హెరాత్: శ్రీలంక తరపున 93 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రంగనా హెరాత్ మొత్తం 433 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతను 5 సార్లు 12 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.

4- సిడ్నీ బర్న్స్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు సిడ్నీ బర్న్స్ 27 టెస్టు మ్యాచ్‌ల్లో మొత్తం 189 వికెట్లు పడగొట్టాడు. అతను 4 సార్లు 12 వికెట్లు సాధించాడు.

5- ఫజల్ మహమూద్: ఫజల్ మహమూద్ పాకిస్థాన్ తరపున 34 టెస్టు మ్యాచ్‌లు ఆడి మొత్తం 139 వికెట్లు పడగొట్టాడు. 4 సార్లు 12 వికెట్లు తీశాడు.





























