AP News: పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే
పద్మావతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. షంటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులెవరూ లేని కోచ్ బుధవారం తిరుపతి రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. అందుతున్న వివరాల ప్రకారం.. షంటింగ్ (కోచ్‌లను రైలుకు లింక్) చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది కోచ్‌ను మళ్లీ పట్టాల పైకి తెచ్చారు. దీంతో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను రీ షెడ్యూల్ చేసినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో ట్రైన్ కూడా రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. ట్రైన్ నంబర్. 12763 తిరుపతి నుంచి సికింద్రాబాద్ బయల్దేరాల్సిన పద్మావతి ఎక్స్‌ప్రెస్ సాయత్రం 4.55 గంటలకు స్టార్ట్ అవ్వాల్సి ఉండగా.. బుధవారం రాత్రి 7.45 గంటలకు బయల్దేరింది. అదేవిధంగా తిరుపతి – నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్… తిరుపతి నుంచి సాయంత్రం 5.30 గంటలకు స్టార్స్ అవ్వాల్సిన ఉండగా.. రాత్రి 8 గంటలకు బయల్దేరుతుందని అధికారులు వెల్లడించారు.
కాగా జూన్ 21న ఏపీలోని విజయనగరం రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. లూప్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్‌కు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టాలు తప్పిన ఘటనలో ఎలాంటి గాయాలు లేదా పెద్ద నష్టం జరగనప్పటికీ, ఈ ఘటనతో సెక్షన్‌లో కొన్ని గంటలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
