AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భార్య కోసం భర్త, ప్రియుడి కోసమే ఆమె.. శామీర్‌పేట్ కాల్పుల కేసులో తెరపైకి సంచలన విషయాలు..

Serial Actor Manoj: ఓ వైపు భార్య కోసం భర్త పోరాటం. మరో వైపు ప్రియుడి కోసం భార్య ఆరాటం. ఈ భార్య, భర్తల నడుమ నలుగుతున్న పిల్లలు. ఈ సంసార చదరంగాన్ని మొత్తం నడిపిస్తుంది ఆ ప్రియుడు. అసలు.. ఏం జరిగింది భార్య భర్తల మధ్య అంటే..

Hyderabad: భార్య కోసం భర్త, ప్రియుడి కోసమే ఆమె.. శామీర్‌పేట్ కాల్పుల కేసులో తెరపైకి సంచలన విషయాలు..
Shameerpet Firing Case
Ranjith Muppidi
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 17, 2023 | 10:33 AM

Share

Serial Actor Manoj: భార్య భర్తల మధ్య నలుగుతున్న పిల్లలు భార్య భర్త మధ్యలో ప్రియుడు లేదా ప్రియురాలు. ఇప్పుడు ఇవే విడాకులకు కారణం అవుతున్నాయి . తాజాగా శామీర్‌పేట కాల్పుల ఘటనలో ఇదే జరిగింది. భర్త మీద కోపంతో పాత స్నేహం ముదిరి బెడ్ రూమ్ వరకు దారి తీసింది. ప్రేమగా చూసుకోకపోవడమో, మూడో వ్యక్తి మీద మోజో.. కానీ కాపురాలు కూలుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్ధార్థ్ దాస్, స్మితకి 20 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలున్నారు. మరి ఎక్కడ వీరికి మనస్పర్థలు వచ్చాయో తెలియదు కానీ భర్త తనకి అవసరం లేదని ఆమె అనుకుంది. వెంటనే పాత పరిచయం ఉన్న మనోజ్‌తో సన్నిహితంగా మెలిగింది. 2019 లో తన భర్త తనని వేధించకుండా కోర్ట్ నుండి ఆర్డర్స్ తీసుకుంది.

అయితే ప్రియురాలు చాలు కానీ పిల్లలు వద్దు అనుకున్నాడు ప్రియుడు. అనుకున్న ప్రకారమే పిల్లలని కొట్టడం ప్రారంభించాడు. ఇది భరించలేని కొడుకు బాలల సంరక్షణ కమిటీ కి పిర్యాదు చేసాడు. దింతో cwc అధికారులు తండ్రికి సమాచారం అందించారు. వైజాగ్ నుండి తండ్రి వెంటనే..మనోజ్, భార్య స్మిత ఉంటున్న సెలెబ్రిటీ వీళ్లాకి వెళ్ళాడు. సిద్దార్ద్‌ను చూసిన మనోజ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్కడ మాట మాట పెరగడంతో, ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడు మనోజ్. బయపడి పారిపోయిన సిద్దార్త్ 100 కి డయల్ చేసి ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని మనోజ్‌ని అరెస్ట్ చేశారు.

భార్య తో కలిసి ఉండేందుకు సిద్దార్డ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓ వైపు భర్త ను చూసేందుకు ఇష్టపడని భార్య స్మితా.. పోలీస్ స్టేషన్ నుండి బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది. రెండో రోజు భార్య స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని తెలియడం తో పోలీస్ స్టేషన్ కు వచ్చి స్మితా తో కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించారు. సిద్దార్డ్ ను చూసి ప్రియుడు మనోజ్ ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆమె తో ఒక్కసారి మాట్లాడి వెళ్తానని పోలీసులకు చెప్పడంతో…పోలీసుల స్మితా వద్దకు వెళ్లి ప్రయత్నించిన…పోలీసుల పైనే ఎదురు తిరిగింది స్మితా. తన భర్తతో కలసి ఉండటం ఇష్టం లేదనే కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానని..తనను మాట్లాడాలని బలవంతం చేయవద్దంటూ పోలీసులకు చెప్పడంతో వారు సిద్దార్ద్‌ను పంపించే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

కానీ పోలీస్ స్టేషన్ లో ఉన్న భర్త సిద్దార్ద్ ఆమె తో మాట్లాడి కన్విన్స్ చేయలనుకున్నాడు. స్మితా కు కామన్ ఫ్రెండ్స్ తో మాట్లాడి కలిసి ఉండేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇంత గొడవ చేసిన భర్త తో తాను తిరిగి కలిసి ఉండే ప్రసక్తి లేదని స్మితా తేల్చి చెప్పడంతో సిద్దార్ద్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరోవైపు 18న cwc విచారణలోనే పిల్లల భవిష్యత్ పై నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు. ఇప్పటికే పిల్లలు ఇద్దరు తల్లి స్మితా సవతి తండ్రి మనోజ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. పిల్లల స్టేట్మెంట్ మరోసారి రికార్డ్ చేయనున్న అధికారులు…ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..