AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAN vs IND: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. వన్డే చరిత్రలో భారత్‌పై తొలి విజయం.. స్వల్ప స్కోర్‌ చేధించలేకపోయిన టీమిండియా..

BANW vs INDW 1st ODI: ఢాకా వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌ మహిళల చేతిలో టీమిండియా అమ్మాయిలు ఓటమిపాలయ్యారు. వర్షం కారణంగా 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ 152 పరుగులకే పరిమితమయింది. టీమ్ కెప్టెన్ నిగర్ సుల్తానా..

BAN vs IND: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. వన్డే చరిత్రలో భారత్‌పై తొలి విజయం.. స్వల్ప స్కోర్‌ చేధించలేకపోయిన టీమిండియా..
BANW vs INDW; 1st ODI
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 16, 2023 | 6:58 PM

Share

BANW vs INDW 1st ODI: ఢాకా వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌ మహిళల చేతిలో టీమిండియా అమ్మాయిలు తొలిసారిగా ఓటమిపాలయ్యారు. వర్షం కారణంగా 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ 152 పరుగులకే పరిమితమయింది. టీమ్ కెప్టెన్ నిగర్ సుల్తానా 39 పరుగులతో బంగ్లా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ క్రమంలో భారత్ తరఫున అమంజోత్ కౌర్ 4 వికెట్లతో చెలరేగగా.. దేవికా వైద్య 2, పూజా వాస్త్రాకర్ 1 వికెట్ తీసుకున్నారు. అయితే స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండిాయా మహిళలు బ్యాటింగ్‌లో చేతులెత్తేశారు.

టీమిండియా ఓపెనర్లుగా వచ్చిన ప్రియా పూనియా(10), స్మ్రతీ మంధాన(11) నుంచి శుభారంభం లభించలేదు. ఆ తర్వాత వచ్చిన యస్తికా భాటియా(15), కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్(5) సహా అంతా చేతులెత్తేయడంతో భారత అమ్మాయిల జట్టు 113 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ 20 పరుగులతో భారత్ తరఫున టాప్ స్కోర‌ర్‌గా నిలిచిందంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఈ మ్యాచ్‌లో మనవాళ్ల ఆటతీరు. మరోవైపు బంగ్లా తరఫున మరుఫా అక్తర్ 4, రబేయా ఖాన్ 3 వికెట్లతో రాణించగా.. నహీదా అక్తర్, సుల్తానా ఖాతున్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో టీమిండియాపై బంగ్లా అమ్మాయిలు 40 పరుగుల తేడాతో తొలి వన్డేలో విజయం సాధించింది.

కాగా, బంగ్లాదేశ్, టీమిండియా అమ్మాయిలు ఇప్పటివరకు 6 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇక ఆదివారం జరిగిన 6వ వన్డేలో తొలి సారిగా భారత్‌పై బంగ్లా అమ్మాయిలు విజయం సాధించారు. మరోవైపు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ కంటే బంగ్లాదేశ్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. అలాగే రెండో వన్డే ఈ నెల 19న, మూడో మ్యాచ్‌ జూలై 22న జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

తొలి వన్డే ఇరు జట్ల వివరాలు:

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11: ముర్షిదా ఖాతున్, షర్మిన్ అక్తర్, ఫెర్గానా హోక్, నిగర్ సుల్తానా(కెప్టెన్, వికెట్ కీపర్), షోర్నా అక్తర్, నహిదా అక్తర్, రీతు మోని, ఫాహిమా ఖాతున్, రబేయా ఖాన్, మరుఫా అక్తర్, సుల్తానా ఖాతున్

టీమిండియా ప్లేయింగ్ 11: స్మృతి మంధాన, ప్రియా పునియా, జెమీమా రోడ్రిగ్జ్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), యాస్తిక భాటియా(వికెట్ కీపర్), దీప్తి శర్మ, దేవికా వైద్య, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, అనూషా బరెడ్డి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us