AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీవార్.. బోనాల పండుగ పూట తెరపైకి మరోసారి విభేదాలు..

Hyderabad, Jubilee Hills News: జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు మరో మారు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు బీజేపీ నుంచి బిఆర్ఎస్‌లోకి వచ్చి కార్పొరేషన్ చైర్మన్ అయిన రావుల శ్రీధర్ రెడ్డికి మధ్య కొద్దిరోజులుగా కోల్డ్ వార్ నడుస్తుంది. శ్రీధర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే టిక్కెట్‌పై..

Hyderabad: బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీవార్.. బోనాల పండుగ పూట తెరపైకి మరోసారి విభేదాలు..
Maganti Gopinath Vs Ravula Sridhar Reddy
Sridhar Prasad
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Jul 16, 2023 | 6:18 PM

Share

Hyderabad, Jubilee Hills News: జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు మరో మారు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు బీజేపీ నుంచి బిఆర్ఎస్‌లోకి వచ్చి కార్పొరేషన్ చైర్మన్ అయిన రావుల శ్రీధర్ రెడ్డికి మధ్య కొద్దిరోజులుగా కోల్డ్ వార్ నడుస్తుంది. శ్రీధర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే టిక్కెట్‌పై కన్నెయ్యడమే ఇందుకు కారణమని పొలిటికల్ ప్రచారం కూడా నడుస్తోంది. ఇక కొన్ని రోజులుగా నియోజవర్గంలో సందర్భం వచ్చిన ప్రతిసారి శ్రీధర్ రెడ్డి వర్గీయులు కడుతున్న ఫ్లిక్సీల్లో స్థానిక ఎమ్మెల్ల్యే మాగంటి ఫోటో చిన్నగా వేయడం పట్ల ప్రతిసారి గొడవ అవుతుంది.

అయితే ఈసారి ఏకంగా వెంగలరావు నగర్ డివిజన్, గణేష్ సింగ్ అనే కార్యకర్త ఇంటికి బిఆర్ ఎస్ నేత శ్రీధర్ రెడ్డి అనుకులంగా వేస్తున్న ఫ్లెక్సీల్లో తన ఫోటో చిన్నగా వేయడంపై ఆభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్.. రావుల శ్రీధర్ రెడ్డి కావాలనే ఇలా చేస్తున్నారు అంటు మండిపడుతున్నారు కానీ శ్రీధర్ రెడ్డి వర్గీయులు మాత్రం ఎమ్మెల్యే ఓర్వలేకే తన ఇంటిపై దాడికి వచ్చాడు అంటున్నారు గణేష్ సింగ్ నిన్న మొన్నటి వరకు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్‌కు ఎమ్మెల్యే కు మధ్య ఘర్షణ వాతావరణం ఉండగా తాజాగా శ్రీధర్ రెడ్డి ఎంటర్ అవ్వడంతో జూబ్లీహిల్స్ హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..