PM Modi: ఫ్రాన్స్ టూర్ ఇలా సాగింది.. వీడియో షేర్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..
PM Modi France Visit: ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ యూరోపియన్ దేశంలో 2 రోజుల అధికారిక పర్యటనకు వెళ్లారు. తన పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ దేశంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ..
PM Modi France Visit: ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ యూరోపియన్ దేశంలో 2 రోజుల అధికారిక పర్యటనకు వెళ్లారు. తన పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ దేశంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఆ దేశ జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బాస్టిల్ డే పరేడ్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే శుక్రవారం పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఆయన కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు మ్యూజియంలోకి ప్రధాని మోదీని ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్, ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్ స్వాగతించారు.
అలాగే తన కోసం ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియంలో ఏర్పాటు చేసిన విందు సందర్భంగా ప్రధాని మోదీ భారత్-ఫ్రాన్స్ స్నేహం, సారూప్యతలను హైలైట్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అనేక ఐకానిక్ వర్క్‌లను ప్రత్యేకంగా వీక్షించారు. విశేషం ఏమిటంటే.. చివరిసారిగా 1953లో క్వీన్ ఎలిజబెత్ కోసం లౌవ్రేలో విందు జరిగింది. మళ్లీ ఇప్పుడు ప్రధాని మోదీ కోసం నిర్వహించబడింది. ఇంకా మెనుకి సంబంధించిన థ్రెడ్‌లో కూడా భారతీయ త్రివర్ణ పతాకం ఉంది. ఇది ఫ్రాన్స్ ప్రోటోకాల్‌ని అతిక్రమించడమే అవుతుంది, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ ఫ్రెంచ్ రంగులను మాత్రమే చేస్తారు. అంతేకాక ఫుడ్ మెను కూడా ప్రత్యేకంగా శాఖాహారుల కోసమే రూపొందించనట్లుగా ఉంది.
Here are highlights from yesterday’s programmes in Paris, which include the iconic Bastille Day parade. pic.twitter.com/HmDcRSdjs1
— Narendra Modi (@narendramodi) July 15, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం