Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Karumuri: ‘కోర్టుకి వెళ్లొచ్చు, నిరూపిస్తే ఊరేసుకుంటా’.. పవన్ వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి కౌంటర్..!

Karumuri Venkata Nageswara Rao: జనసేన ఆధినేత పవన్‌ కల్యాణ్‌కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్‌ ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. ‘పురోహితుల వేలంపాట ఆరోపణలు..

Minister Karumuri: ‘కోర్టుకి వెళ్లొచ్చు, నిరూపిస్తే ఊరేసుకుంటా’.. పవన్ వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి కౌంటర్..!
Minister Karumuri Vs Pawan Kalyan
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 15, 2023 | 11:10 AM

Karumuri Venkata Nageswara Rao: జనసేన ఆధినేత పవన్‌ కల్యాణ్‌కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్‌ ఇచ్చారు. అలాగే ఒక్క వాలంటీర్ జైలుకి వెళ్లినా ఊరేసుకుంటానని, తణుకులో ఒక్క బెల్ట్ షాప్ ఉందని నిరూపించినా రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. ‘పురోహితుల వేలంపాట ఆరోపణలు అర్ధరహితం. ఈవో తీసుకున్న నిర్ణయాన్ని సీఎం జగన్‌కు ఎలా ఆపాదిస్తారు..? నిర్ణయం తీసుకున్న రోజే దేవాదాయశాఖ మంత్రి వేలంపాటని ఆపేశార’ని అన్నారు.

అలాగే వాలంటీర్లపై జనసేనాని చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కూడా మాట్లాడుతూ.. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కోర్టుకు వెళ్లొచ్చు. వాలంటీర్లలో ఒక్కరు తప్పు చేసినట్లు నిరూపించినా ఉరేసుకుంటానని, చంద్రబాబు రాసిచ్చిందే పవన్‌ చదువుతున్నారని, తణుకులో ఒక్క బెల్టుషాపు ఉందని నిరూపించినా రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..