బోరుబావి నుంచి వెలువడుతున్న గ్యాస్, ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.. భయాందోళనలో స్థానికులు..

20ఏళ్ల క్రితం ONGC వారు పశ్చిమ బెంగాల్ కూలీల ద్వారా ఈ ఏరియాలో సిస్మిక్ సర్వే చేస్తూ బోర్లు త్రవ్వారు. దాంతో అప్పుడప్పుడూ కొన్ని బోర్లు ద్వారా గ్యాస్ లీకై బుడగలు వస్తున్నాయని చెప్తున్నారు స్థానికులు. ఈ ఘటనకు కూడా సిస్మిక్ సర్వే కోసం వేసిన బోర్లే కారణమని అంటున్నారు. బోరు బావి నుంచి ఎగిసి పడుతున్న మంటలతో

బోరుబావి నుంచి వెలువడుతున్న గ్యాస్, ఎగిసిపడుతున్న అగ్ని కీలలు.. భయాందోళనలో స్థానికులు..
Gas Leakage
Follow us

|

Updated on: Jul 15, 2023 | 12:38 PM

కోనసీమ జిల్లాలో గుడిమల్లంకలో ఉదయం సుమారు 6గంటల నుంచి గ్యాస్ లీకై మంట వ్యాపిస్తూనే ఉంది. ఫైర్ సిబ్బంది, పోలీస్ అధికారులు ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గుడిమల్లంకకు చెందిన గోపరాజు అనే రైతు బోరు నుండి గ్యాస్ లీక్ పక్కన ఉన్న కరెంటు స్విచ్ బోర్డు ద్వారా షాట్‌ సర్క్యూటై మంటలు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు అధికారులు.

20ఏళ్ల క్రితం ONGCవారు పశ్చిమ బెంగాల్ కూలీల ద్వారా ఈ ఏరియాలో సిస్మిక్ సర్వే చేస్తూ బోర్లు త్రవ్వారు. దాంతో అప్పుడప్పుడూ కొన్ని బోర్లు ద్వారా గ్యాస్ లీకై బుడగలు వస్తున్నాయని చెప్తున్నారు స్థానికులు. ఈ ఘటనకు కూడా సిస్మిక్ సర్వే కోసం వేసిన బోర్లే కారణమని అంటున్నారు. బోరు బావి నుంచి ఎగిసి పడుతున్న మంటలతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..